సినిమాలలో, సీరియళ్లలో నటించే వాళ్లపై సాధారణ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.కృష్ణా ముకుంద మురారి( Krishna Mukunda Murari ) సీరియల్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న యశ్మీ గౌడ( Yashmi Gowda ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.
సెట్ లో అందరూ నన్ను ముకుంద అని పిలుస్తారని యశ్మీ అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతానని ఆమె పేర్కొన్నారు.
క్యాస్టింగ్ డైరెక్టర్స్ నుంచి తెలుగులో ఛాన్స్ వచ్చిందని యశ్మీ గౌడ అన్నారు.
స్వాతిచినుకులు సీరియల్ తో తెలుగులో కెరీర్ మొదలైందని ఆమె కామెంట్లు చేశారు.ముకుంద పాత్ర బాగుందని చాలామంది చెబుతారని యశ్మీ గౌడ వెల్లడించారు.
నాన్న బిజినెస్ చేస్తున్నారని ఆమె కామెంట్లు చేశారు.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఆసక్తి ఉండేదని యశ్మీ పేర్కొన్నారు.
చిన్నప్పుడు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసేదానినని యశ్మీ అన్నారు.
నాకు మొదట తెలుగు రాదని కన్నడ, తెలుగు కొన్ని సిమిలర్ గా ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు.త్రినయని సీరియల్ లో కూడా నేను చేశానని యశ్మీ పేర్కొన్నారు.సినిమాలు చేయడం నాకు ఇష్టమని మంచి పాత్రలు అయితే మాత్రమే నేను చేస్తానని ఆమె తెలిపారు.
నాకు సైకో పాత్ర చేయాలని ఉందని ఆమె పేర్కొన్నారు.నేను ఇండస్ట్రీలోకి రావడం నాన్నకు ఇష్టం లేదని యశ్మీ గౌడ పేర్కొన్నారు.
అందరినీ ఇంప్రెస్ చేయడం సులువు కాదని అమ్మ చెబుతుందని ఆమె చెప్పుకొచ్చారు.ఫస్ట్ లవ్ బ్రేకప్ కావడానికి యశ్మీ గౌడ కారణం చెప్పుకొచ్చారు.ఇండస్ట్రీకి రావడం వల్లే ఫస్ట్ లవ్ బ్రేకప్( First Love Breakup ) అయిందని ఆమె తెలిపారు.నేను ప్రేమించిన వ్యక్తి తల్లికి నేను ఈ ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం లేదని యశ్మీ గౌడ పేర్కొన్నారు.
ఆ లవ్ వన్ ఇయర్ లవ్ అని యశ్మీ గౌడ కామెంట్లు చేశారు.యశ్మీ గౌడ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.