శ్రీ లీల ( Sreeleela ).ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న హీరోయిన్ పేరు.
అతి చిన్న వయసులోని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం 8 సినిమా అవకాశాలను చేతిలో పెట్టుకున్నారు.అంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.
ఇలా ఇండస్ట్రీలో బడా ప్రాజెక్టులలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియా( Soical Media )లో నిత్యం వైరల్ అవుతూనే ఉంది.ఇక శ్రీలీలకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
చిన్నప్పటినుంచి ఈమెను తన తల్లి చాలా కండిషన్స్ పెడుతూ పెంచారట.
చిన్నపిల్లలకు సాధారణంగా ఆడుకోవడానికి ఎంతో ఇష్టంగా చెబుతుంటారు.అయితే అలాంటి ఛాన్స్ ఈమెకు తన తల్లి ఇవ్వలేదట స్కూల్ అయిపోగానే ట్యూషన్ ట్యూషన్ అయిపోగానే డాన్స్ క్లాస్( Dance Class ) యాక్టింగ్ అంటూ తనని ఒక క్షణం పాటు తీరిక లేకుండా ఎప్పుడు తనని బిజీగా ఉంచడంతో విసిగిపోయినటువంటి శ్రీ లీల కొన్నిసార్లు ఈ టార్చర్ నుంచి తప్పించుకోవడం కోసం దొంగ సాకులు చెబుతూ ఇంటిపట్టునే ఉండేదట.ఇలా స్కూల్ యాక్టింగ్ డాన్స్ క్లాసెస్ కు వెళ్లాలి అంటే బోర్ కొట్టినప్పుడు ఈమె కడుపునొప్పి అంటూ దొంగ సాకులు చెప్పేవారట.
ఇలా తనకు కడుపునొప్పి( Stomach ache ) వస్తుందని తన హెల్త్ బాలేదు అంటూ ఈమె లేనిపోని కారణాలు చెబుతూ తన తల్లినీ మోసం చేస్తూ ఇంటిపట్టునే ఉండి ఆ రోజంతా తనకి ఇష్టం వచ్చిన విధంగా గడుపుతూ ఉండేవారని తెలుస్తుంది.ప్రస్తుతం శ్రీ లీలకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చిన్నప్పుడు ఇంత అల్లరిగా ఉన్నటువంటి ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయారా అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక చదువు పరంగా శ్రీ లీల వైద్యవృత్తిని ( Medicine ) అభ్యసించిన సంగతి మనకు తెలిసింది.