వనిత సంచలన ఆరోపణలు.. రమ్యకృష్ణ రియాక్షన్ ఏంటంటే..?

గతేడాది మూడో పెళ్లి చేసుకోవడం ద్వారా వనితా విజయ్ కుమార్ పేరు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో మారుమ్రోగిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత అనేక వివాదాల ద్వారా వనితా విజయ్ కుమార్ వార్తల్లో నిలిచారు.

విజయ్ మంజుల కూతురు అయిన వనితా విజయ్ కుమార్ బిగ్ బాస్ జోడిగల్ అనే రియాలిటీ షోకు అర్ధాంతరంగా గుడ్ బై చెప్పారు.షో నుంచి తప్పుకున్న తరువాత వనితా విజయ్ కుమార్ వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ అంటూ సంచలన ఆరోపణలు చెబుతారు.

ఒక సీనియర్ నటి వల్ల తాను ఆ షో నుంచి తప్పుకున్నానని ఆమె పేర్కొన్నారు.అయితే ప్రముఖ నటి రమ్యకృష్ణ ఆ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రమ్యకృష్ణ వల్లే వనిత ఆ షోకు దూరమైందని వార్తలు వచ్చాయి.

ఈ షోకు రమ్యకృష్ణనే సీనియర్ కావడంతో ఉద్దేశపూర్వకంగా వనితా విజయ్ కుమార్ రమ్యకృష్ణను టార్గెట్ చేసి కామెంట్లు చేశారని వినిపించాయి.అయితే తాజాగా ఈ వివాదంపై రమ్యకృష్ణ స్పందించారు.

Advertisement
Actress Ramya Krishna Reaction About Vanitha Vijay Kumar Sensational Comments ,

గతంలో ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోని రమ్యకృష్ణ తనపై ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ షోలో ఏం జరిగిందో తనకు తెలియదని రమ్యకృష్ణ అన్నారు.వనితా విజయ్ కుమార్ ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్లు చేశారో ఆమెనే అడిగితే బాగుంటుందంటూ హుందాగా బదులిచ్చారు.

తన దృష్టిలో ఇది పెద్ద విషయం కాదని నో కామెంట్స్ అంటూ రమ్యకృష్ణ ఈ వివాదం గురించి హుందాగా బదులిచ్చారు.

Actress Ramya Krishna Reaction About Vanitha Vijay Kumar Sensational Comments ,

పరోక్షంగా ఈ వివాదంతో తనకేం సంబంధం లేదని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.అయితే వనితా విజయ్ కుమార్ ఎందుకు సంచలన కామెంట్లు చేశారో తెలియాల్సి ఉంది.కొందరు నెటిజన్లు మాత్రం వనిత కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు