తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) రహస్య ఇద్దరు ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటైన విషయం తెలిసిందే.దాదాపుగా ఆరేళ్ళ పాటు సీక్రెట్ రిలేషన్షిప్ మైంటైన్ చేసిన ఈ జంట తాజాగా ఎంగేజ్మెంట్ వేడుకతో ( engagement ceremony )ఒకటయ్యారు.
హీరో కిరణ్ మొదట రాజావారు రాణిగారు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు కిరణ్.తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం ఆతర్వాత ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో మరో హిట్ తనఖాతాలో వేసుకున్నాడు.
ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో వరుసగా ఆఫర్స్ అందుకున్నాడు కిరణ్.
అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు.అయినా కూడా వెనకాడుగు వేయకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.ఈ క్రమంలోనే ఈ కుర్రహీరో పెళ్ళికి రెడీ అయ్యాడు.
ఇటీవలే కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్ జరిగింది.తన మొదటి సినిమా హీరోయిన్ రహస్యతో ఆయన ఎంగేజ్ మెంట్ జరిగింది.
ఈ ఇద్దరూ దాదాపు 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు.కానీ వీరి ప్రేమ వ్యవహారం ఎప్పుడు బయటకు రాలేదు.
ఆ మధ్య ఒకటి రెండు వార్తలు వచ్చినా దాని పై ఇద్దరూ స్పందించలేదు.ఇక ఇప్పుడు ఇలా సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
తాజాగా తమ ప్రేమ గురించి హీరోయిన్ రహస్య మాట్లాడింది. ఈ మేరకు ఆమె ఒక వీడియోను రిలీజ్ చేసింది.కాగా కిరణ్ లానే రహస్య కూడా షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే.రాజావారు రాణిగారు సినిమా తర్వాత రహస్య సినిమాలను పక్కన పెట్టేసింది.
ఎంగేజ్ మెంట్ తర్వాత తన ప్రేమ గురించి రహస్య సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.గత ఆరేళ్లుగా నువ్వు నాకు తెలుసు.
మంచి స్నేహితులుగా ఉన్నాం.ప్రేమలో పడ్డాం.
ఎన్నో మాట్లాడుకున్నాం.ఎలాంటి ప్లానింగ్ లేకుండానే చాలా ట్రిప్స్‌కి వెళ్లాం.
ఎన్నో ఆటుపోట్లు చూశాం.మొత్తానికి మనిద్దరిదీ అద్భుతమైన, అందమైన జర్నీ.
నీతోపాటు ఈ జర్నీని కంటిన్యూ చేయాలని చాలా ఆత్రుతగా ఉన్నాను.నా సర‍్వస్వం నువ్వే కిరణ్ అబ్బవరం’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది రహస్య.
అలాగే ఈ ఇద్దరికీ సంబందించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.