తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమాకు తోనే మంచి గుర్తింపును ఏర్పరచుకుంది రాశి ఖన్నా, మొదటి సినిమాలో తన అందం అధినయం నటన తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అతి తక్కువ సమయంలోనే ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకుంది.ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.
ఈ రెండు సినిమాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి ఖన్నా ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.

కాగా రాశి ఖన్నా కెరీర్ లో ఇప్పటివరకు దాదాపు పది కీ పైగా సినిమాలలో నటించినప్పటికీ ఆమె కెరియర్ లో చెప్పుకోదగ్గ సరైన హిట్ సినిమా ఒకటి కూడా లేదు.ఇది ఇలా ఉంటే రాశి ఖన్నా ఇటీవలే పక్కా కమర్షియల్ థాంక్యూ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలు కూడా ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.
దీంతో ఈ ముద్దుగుమ్మకు మళ్ళీ నిరాశ ఎదురయింది.అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు.
పూర్తిగా అవకాశాలు తగ్గాయి.అయితే దీనికి కారణం ఆమె గతంలో ఎడా పెడా చేసిన సినిమాలే కారణమని అంటున్నారు నెటిజన్స్.
రాశి ఖన్నా ప్రస్తుతం హిందీలో ఫర్జ్ అనే వెబ్ సిరీస్‌తో పాటు యోధ అనే సినిమాలో కూడా నటిస్తోంది.

ఇక ఈ భామ నటించిన లేటెస్ట్ సినిమా థాంక్యూ.నాగచైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.దీంతో రాశీ ఖన్నా విషయంలో ఓ సెంటిమెంట్ ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చింది.
రాశి ఖన్నా ఏదైనా సినిమాలో హీరోతో లిప్ లాక్ చేస్తే ఆ మూవీ ఫ్లాప్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.అయితే ఈ విషయంపై నెటిజన్స్ కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తున్నారు.
రాశీ ఖన్నా 2013లో మద్రాస్ కేఫ్ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమాలో రాశీ ఖన్నా, జాన్ అబ్రహంతో కాస్తా హాట్ హాట్‌గా నటించడమే కాదు ముద్దు కూడా ఇస్తుంది.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజస్టర్ అయ్యింది.ఆ తరువాత తెలుగులో జిల్,జోరు,బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు, వరల్డ్ ఫేమస్ లవర్ ఇక లేటెస్ట్‌గా వచ్చిన నాగ చైతన్య థ్యాంక్యూ ఈ సినిమా అన్నింటీలోను రాశీఖన్నా లిప్ లాక్స్ అన్నాయనీ అందుకే ఈ సినిమాలు అన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా ఆకట్టుకోలేదని.ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం రాశీ ఖన్నా ముద్దే అని చర్చించుకుంటున్నార
.






