టాలీవుడ్ ప్రముఖ నటీమణులలో ప్రేమ( Actress Prema ) ఒకరు కాగా ఈ నటికి ప్రేక్షకుల్లో భారీ రేంజ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ నటి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను ఈ బ్యూటీ పంచుకున్నారు.డైరెక్టర్ కోడి రామకృష్ణ( Director Kodi Ramakrishna ) నాకు తెలుగు నేర్పించడం జరిగిందని ప్రేమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పెళ్లి జరిగిన కొంతకాలానికే విడాకులు తీసుకున్నానని మొదట ఈ నిర్ణయాన్ని నా తల్లీదండ్రులకు చెప్పడం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.నేను విడాకులు తీసుకోవాలని తీసుకున్న నిర్ణయానికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించిందని ప్రేమ అభిప్రాయం వ్యక్తం చేశారు.చాలామంది అలాంటి టైమ్ లో సూసైడ్ దిశగా అడుగులు వేస్తారని కానీ నేను మాత్రం సూసైడ్ చేసుకోవాలని అనుకోలేదని ప్రేమ చెప్పుకొచ్చారు.భర్తతో మనస్పర్ధలు రావడం వల్లే ఆమె విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది.

నాకు ఎదురైన పరిస్థితిని ఛాలెంజ్ గా తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.పెళ్లి అనేది లైఫ్ కాదని ఛాలెంజ్ లు స్వీకరించడం ద్వారా దృఢంగా అయ్యే అవకాశం ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.నేను ఎమోషనల్ గా, సెన్సిటివ్ గా ఉండేదానినని ఆ తర్వాత స్ట్రాంగ్ అయ్యానని ప్రేమ తెలిపారు.రెండో పెళ్లి వార్తల గురించి సైతం ప్రేమ స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

లైఫ్ లో తగిన వ్యక్తి ఉండాలని ప్రేమ అభిప్రాయపడ్డారు.నాకు తగిన వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని ఆమె చెప్పుకొచ్చారు.నాకు క్యాన్సర్ వచ్చిందని కొంతమంది ప్రచారం చేశారని అయితే ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ప్రేమ పేర్కొన్నారు.కొంతకాలం పాటు నేను ఆస్ట్రేలియాలో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.
నా లైఫ్ ఎలా ఉండాలనేది నాకు తెలుసని ప్రేమ కామెంట్లు చేశారు.







