టాలీవుడ్ లో హీరోయిన్స్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఆర్టిస్ట్ ల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు( Character Artists ) ముందు వరస లో ఉంటారు ఇక వాళ్ళు వయసు పెరుగుతున్నా కూడా ఆఫర్లను సొంతం చేసుకుంటూ అందరిని అలరిస్తు ఉంటారు.అలాంటి వాళ్లలో నటి ప్రగతి( Actress Pragathi ) ఒకరు.
అనే చాలా సినిమాల్లో తల్లి గా అత్తగా నటించిన మెప్పించారు, ఇకపోతే తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి తాను అనుభవించిన కష్టాల గురించి ఒక ఇంటర్వ్యూలో పంచుకొని మరింత ఎమోషనల్ అయ్యింది.ఇకపోతే ఇండస్ట్రీలోకి రాకముందు తాను మోడలింగ్ చేయాలనేది తన కోరిక అయితే కొంతమంది ఊరికే తింటున్నావ్ అంటూ కామెంట్లు చేస్తే తనకు నచ్చేది కాదు అని ఆమె వెల్లడించింది…

ఇకపోతే పిజ్జా హట్ లో( Pizza Hut ) కూడా డబ్బు కోసం తాను పని చేశానని.టెలికాం బూతులో , ఎస్టిడి బూతులో కూడా పనిచేయాల్సి వచ్చింది అని ఆమె తెలిపింది.కార్టూన్ డబ్బింగ్ కోసం కూడా తాను పనిచేసినట్లు ఆమె స్పష్టం చేసింది.
అలా మోడలింగ్ లోకి వచ్చానని తెలిపిన ప్రగతి తనను ఒకరు స్ఫూర్తిగా తీసుకున్నారంటే ఆరోజు తాను ఎన్నో దాటానని అనుకుంటాను అంటూ ఆమె కామెంట్ చేయడం గమనార్హం.ప్రగతి మాట్లాడుతూ.
నేను అందగత్తెను కాదు.ఆ సమయంలో లడ్డూ లాగా ఉండేదాన్ని.
ప్రతి వృత్తికి కూడా ఒక అర్హత ఉంటుంది.దానికి ప్రిపేర్ గా ఉండాలి.హీరోయిన్గా వచ్చిన అవకాశాలను నేను సరిగా ఉపయోగించుకోలేదు…

హీరోయిన్ గా నాకు పెద్దగా ఆసక్తి కూడా లేదు.అందుకే వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేదు.హీరో కం నిర్మాతతో ఏర్పడిన గొడవ వల్లే సినిమాలు చేయకూడదని నిశ్చయించుకున్నాను.అప్పట్లో అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.అయితే నేను ఎవరిని బ్లేమ్ చేయను.ఒకరిని నమ్మి మోసపోయారు అంటే మోసం చేసే వాళ్ళ కంటే మోసపోయిన వాళ్ళదే తప్పు ఇంకోసారి ఆ తప్పును రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఇకపోతే ప్రగతి వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.ముఖ్యంగా ఆమె కెరియర్ పరంగా మరిన్ని విజయాలు సాధించాలని ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు అద్భుతమైన పాత్రలు చేయాలని కోరుకుంటున్నారు…
.