మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి మనందరికీ తెలిసిందే.తన మాటలతో చేష్టలతో అల్లరి అల్లరిగా ఉంటూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది నిహారిక.
కాగా ఈమె యాంకర్ గా మాత్రమే కాకుండా హీరోయిన్గా కూడా పలు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.అయితే హీరోయిన్ గా మాత్రం నిహారిక సక్సెస్ కాలేక పోయింది.
నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.పెళ్లి తర్వాత కూడా నిహారిక ఏ మాత్రం మారలేదు.
అది ఎనర్జీ అదే మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది.కాగా పెళ్లి తర్వాత నిహారిక ప్రొడ్యూసర్ గా మారి వెబ్ సిరీస్ నిర్మాణంలో బిజీ బిజీగా ఉంది.
ఈ క్రమంలోనే జీ 5 ఓటిటి సంస్థతో కలిసి నిహారిక హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది.అయితే ఈ వెబ్ సిరీస్ త్వరలోనే జి ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వెబ్ సిరీస్ నటులు అందరు సుమ హోస్ట్ గా వ్యవహారిస్తూమ్మ క్యాష్ షోలో పాల్గొన్నారు.అనిల్ జీలా, నిఖిల్, నిత్య శెట్టితో కలిసి నిహారిక ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంది.
యాంకర్ సుమ తో పాటు తాను కూడా కౌంటర్లు వేస్తూ అలరించింది నిహారిక.తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు.
అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అందులో.
ఒక స్కిట్ చేస్తూ, డాక్టర్ గా నిహారిక చేయగా, అనిల్ వచ్చి గ్యాస్ ప్రాబ్లం అని అనగా వెంటనే సర్లే సిలిండర్ మార్చుకో అంటూ కౌంటర్ వేసింది నిహారిక.

అంతేకాకుండా ఇంతకీ ఏ సిలిండర్ వాడుతున్నావు? గ్యాస్ సిలిండర్ ఎందుకు మింగావురా అంటూ అనిల్ పై వరుసగా కౌంటర్లు వేసింది నిహారిక.అప్పుడు నిఖిల్.అమ్మ నేను ఏమి ఎరగని పసికందును అని అనడంతో వెంటనే నిహారిక రేయ్ నువ్వు పసి కందువు కాదురా.
కసికందు అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది.ఆ తర్వాత సుమ ఒకవేళ మాటలతో చేష్టలతో కరిగించాల్సి వస్తే చిరంజీవి పవన్ కళ్యాణ్ లో ఎవరిని కరిగిస్తావుఅని అడగగా.
అప్పుడు నిహారిక చిరంజీవి అని సమాధానం ఇచ్చింది.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.







