తెలుగు సినీ ప్రేక్షకులకు నటి మాధవి లత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట నచ్చావులే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మాధవిలత( Madhavi latha ).2008లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని టాక్ అందుకుంది.ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్ 2 చిత్రాల్లో నటించింది.
అంతేకాకుండా మహేష్ బాబు హీరోగా నటించిన అతిథి సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్ట మొదటిసారి కనిపించింది.ఆ తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.

తినేఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా హైలెట్ అయింది అని చెప్పవచ్చు.సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాలపై స్పందిస్తూ ఉంటుంది.అప్పుడప్పుడూ లేనిపోని కాంట్రివర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె బిగ్ బాస్ షోపై( Bigg Boss Show ) సంచలన వాఖ్యలు చేసింది.
ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ విధంగా రాసుకొచ్చింది.బిగ్ బాస్ షో 100 శాతం కమర్షియల్.అందులో సామాన్యులను తీసుకోవాలనేది ఒక సోది టాపిక్.వారిని పెడితే ఎవరూ చూడరు.
టీఆర్పీ అస్సలు రాదు.అందుకే పిచ్చి ఆలోచనలు మానేసి చూసేటోళ్లు చూడండి.

ఎవరినీ హౌస్‌లో పెడితే చూస్తారో వాళ్లనే తీసుకుంటారు.ఈ సీజన్‌లో చాలామందిని ట్రై చేశారు.మీ పైసలు, పబ్లిసిటీ మాకొద్దు.మాకు ఇజ్జత్ ముఖ్యం అంటూ చాలామంది బిగ్‌బాస్‌కు బైబై అన్నారు.అందుకే ఉన్నావాళ్లతో అడ్జస్ట్ అవ్వండి.నన్ను చూడమని అడగొద్దు.
థ్యాంక్ యూ అని రాసుకొచ్చింది.పోస్ట్ చేసింది.
అయితే ఈ పోస్ట్ ఎవరినీ ఉద్దేశించి చేసిందో అర్థం కావడం లేదు కానీ మాధవిలత చేసిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతొంది.చాలామంది ఈ సీజన్ లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth )ని ఉద్దేశించి ఆమె ఆ విధంగా వాఖ్యలు చేసిందని అంటున్నారు.







