ఆ మూవీ సమయంలో ఏనుగు లయను ఎత్తుకుని విసిరేసిందట.. చివరకు?

సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఎన్నో రిస్కీ సన్నివేశాలలో నటించాల్సి ఉంటుంది.

లయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ యాక్టర్లలో విజయశాంతితో కలిసి నేను యాక్ట్ చేశానని తెలిపారు.

సుహాసిని గారితో గెలుపు మూవీలో అటించానని లయ చెప్పుకొచ్చారు.విజయశాంతితో కలిసి తమిళ మూవీలో నటించానని మహాచండి పేరుతో ఆ సినిమాను డబ్ చేశారని లయ అన్నారు.

ఆ సినిమాలో ఒక సన్నివేశంలో ఏనుగు తొండంతో నన్ను కూర్చోబెట్టుకుని నడవాలని నాకు ఏనుగు అంటే భయమని లయ అన్నారు.జంతువులు హాని చేయవని అయితే నేను ఇరిటేట్ చేస్తే అవి ఇరిటేట్ అవుతాయని భయపడతానని లయ పేర్కొన్నారు.రిహార్సల్ లో లో ఏనుగు బాగానే చేసిందని టేక్ సమయంలో మాత్రం ఏనుగు ఎత్తుకుని విసిరేసిందని లయ చెప్పుకొచ్చారు

నా శరీరంపై కాలు పెట్టడానికి ఏనుగు ప్రయత్నించిందని ఆమె అన్నారు.ఆ సమయంలో నేను రోల్ అయ్యానని లయ పేర్కొన్నారు.నేను ఆ సీన్ లో చెయ్యను అన్నానని కొన్నిరోజుల తర్వాత ఆ సీన్ ను షూట్ చేశారని ఆమె తెలిపారు.

Advertisement

విజయశాంతి గారు నేనున్నాను కదా అని చెప్పారని ఏనుగు పడేస్తే ఎవరైనా ఏం చేస్తారని లయ అన్నారు.ప్రేమించు సినిమాలో క్లైమాక్స్ సీన్ చేయడానికి నేను ఎంతో కష్టపడ్డానని ఆమె తెలిపారు.

ఆ సమయంలో నా తల గోడకు తగిలిందని లయ అన్నారు.హీరోయిన్లలో రవళి మినహా ఫ్రెండ్స్ లేరని ఆమె తెలిపారు.నాకు తిట్లు రావని వెధవ అని తప్ప నేను తిట్టనని లయ తెలిపారు.

వెధవ అంటే కూడా వెయ్యేళ్లు ధనంతో వర్ధిళ్లు అనే మీనింగ్ ను ఫీల్ అవుతానని ఆమె చెప్పుకొచ్చారు.చెత్త మాటలు మాట్లాడటం కంటే అరవడం మంచిది అని ఆమె చెప్పుకొచ్చారు.

బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..
Advertisement

తాజా వార్తలు