కలియుగ పాండవులు సినిమాతో తొలిసారిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి కుష్బూ( Actress Kushboo ).తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమె తమిళలోనే సూపర్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.
దాదాపు 200 సినిమాల్లో నటిస్తే అందులో 100కు పైగా తమిళ్ సినిమాల్లోనే నటించడం విశేషం.ప్రస్తుతం తమిళ్ మరియు తెలుగు భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు స్పెషల్ పర్ఫామెన్స్ క్యారెక్టర్స్ చేస్తూ తనకి ఇంకా టైం అయిపోలేదు అని నిరూపించుకుంటుంది.
ఇక కుష్బూ రామబాణం సినిమాలో( Rambanam movie ) చివరిసారిగా తెలుగులో కనిపించగా తమిళ్లో హరా అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తుంది.
ఇక అసలు విషయంలోకి వెళితే నటి కుష్బూ ఎప్పుడు దేవుడిని నమ్మింది లేదు.ఆమెకు దైవభక్తిపై ఎలాంటి నమ్మకం కూడా లేదు.కానీ ఇడ్లీలా ఉండే కుష్బూపై తమిళ ప్రేక్షకులకి అమితమైన ఇష్టం ఉంటుంది అందుకే ఆమె కోసం ఏకంగా తమిళనాడులో ఒక గుడి కూడా కట్టేశారు.
అయితే ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుష్బూ తన గుడికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తన అభిమానులతో పంచుకున్నారు.ఫాన్స్ తనకోసం గుడి కట్టిన సందర్భంలో తన మూడు షిప్స్ లలో నటిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఉండేవని ఎక్కువ సినిమాలు ఒకేసారి వచ్చేవని అందువల్ల చాలా బిజీగా ఉండి తీరిక లేకపోవడం వల్ల ఫ్యాన్స్ గుడి కట్టిన సందర్భంలో ఆ విషయం గురించి స్పందించలేక పోయానని తెలిపింది.
ఆ తర్వాత కొన్ని రోజులకు స్పందించాల్సిన అవసరం కూడా లేదనిపించిందని మరికొన్ని రోజులకు తాను పెళ్ళికి ముందే అమ్మాయిలు గర్భం దాల్చడం విషయంపై చేసిన కామెంట్స్ విషయంలో కొంతమంది తన గుడి కూల్చేసే పరిస్థితి వచ్చిందని అందువల్ల నేను గుడి కట్టడం కూల్చడం గురించి ఎప్పుడూ మాట్లాడలేదని, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని తెలిపింది కుష్బూ.ఇక ఇప్పటికీ తన గుడి అలాగే ఉందని కానీ తాను మాత్రం ఎప్పుడూ అక్కడికి వెళ్లలేదంటూ కూడా చెబుతోంది.ఫ్యాన్స్ కి నచ్చితే గుళ్ళు కడతారు మరియు వారి గుండెల్లో పెట్టుకుంటారు అంటూ కుష్బూ స్పందించింది.