మొదటిసారి లవ్ స్టోరీ బయటపెట్టిన కుష్బూ.. వేదికపై నుంచి భర్తకు ఫోన్ చేసి మరీ ప్రపోజ్!

తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో అగ్ర హీరోల సరసన నటించి సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కుష్బూ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేయడమే కాకుండా యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా సందడి చేస్తున్నారు.

 Actress Khusboo Proposed Husband On Extra Jabardasth Show Details, Kushboo, Love-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టారు.

ఈ ప్రోమోలో భాగంగా సుజాత రాకింగ్ రాకేష్ స్కిట్ అనంతరం మీ లవ్ స్టోరీ కూడా చెప్పండి మేడం అంటూ అడగడంతో ఈమె తన లవ్ స్టోరీని బయటపెట్టారు.

దర్శకుడు,నటుడు సుందర్‌ సి ఖుష్బూ భర్త అనే విషయంతెలిసిందే.ఈయన దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా మురై మామన్‌ చిత్ర షూటింగ్‌ టైమ్‌లో ఖుష్బూకి ఫిదా అయ్యారట.

ఈ సినిమా టైంలోనే తనకు ప్రపోజ్ చేశారని ఈ సందర్భంగా లవ్ స్టోరీ గురించి తెలిపారు.

ఇక ఈ సినిమా టైంలోనే తనతో ప్రేమలో పడిన అనంతరం వివాహం చేసుకున్నారని అయితే వీరి వివాహం జరిగి 28 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్కసారి కూడా తన భర్తకు తాను ఐ లవ్ యు చెప్పలేదంటూ కుష్బూ వెల్లడించారు.అయితే ఇప్పుడు ఫోన్ చేసి చెప్పండి మేడం అంటూ రాకేష్ చెప్పగా ఫోన్ చేశారు.అయితే తన భర్త ఫోన్ నెంబర్ ను కుష్బూ స్వీట్ హార్ట్ అని సేవ్ చేసుకున్నారు.

అయితే ఫోన్ చేసిన ఈమె తన భర్తకు ఐ లవ్ యు చెప్పారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube