సినిమా అంటేనే రంగుల ప్రపంచం అని ఊరకనే అనరు.ఇక్కడ నేమ్, ఫేమ్ ఉన్నంత వరకు మాత్రమే నటీనటులను గుర్తు పెట్టుకుంటారు.
ఒక్కసారి సినిమా ఫీల్డ్ నుండి బయటకు వెళితే వారిని ఈజీగా మర్చిపోతారు.మరి ఇప్పుడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ పరిస్థితి కూడా ఇలానే ఉంది.
ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్.ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలతో సినిమాలు చేసింది.దాదాపు 400 సినిమాలను చేసిన స్టార్ హీరోయిన్ ఇప్పుడు దీన స్థితిలో కాలం వెళ్లదీస్తుంది.ఈమె తెలుగులో కాదు.
మలయాళం, తమిళ్ లో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.ఆమె ఎవరి కాదు జయకుమారి.
ఈమె అన్ని సినిమాలు చేసిన ఆస్తులు కూడబెట్టుకోలేక పోయింది.ఆమెకు ఇప్పుడు 70 ఏళ్ళు.
ఈమె పరిస్థితి ప్రెజెంట్ చాలా దీన స్థితిలో ఉంది.చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
జయకుమారి తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలు ఆపేసింది.ఈమెకు ఇద్దరు కుమార్తెలు.
ఒక కొడుకు ఉన్నారు.

అయితే ప్రెజెంట్ వీరందరూ అద్దె ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.ఈమె కిడ్నీ సమస్యలతో బాధ పడడంతో చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.చికిత్స చేయించు కోవడానికి కూడా చేతిలో చిల్లిగవ్వ లేక.ఈమెను చూసుకునేందుకు కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
ఈమె పరిస్థితి చూసి అంతా జాలి పడుతున్నారు.400 సినిమాల్లో హీరోయిన్ గా నటించడం అంటే ఎంత గ్రేట్ అనేది చూడాలి.అయితే ఈమె కెరీర్ లో ఆస్తులు పెద్దగా కూడబెట్టలేదో.
లేదంటే ఈ మధ్యలో కూడబెట్టినవి పోగొట్టుకున్నారో తెలియదు కానీ.ఈమె కొడుకు తో ఉండడానికి ఇల్లు కూడా లేక అద్దె ఇంట్లోనే కాలం గడుపుతున్నట్టు తెలుస్తుంది.
మరి ఈమె పరిస్థితిని చూసి సినీ పెద్దలు ఎవరైనా సహాయం చేస్తారో లేదో చూడాలి.