రోజంతా అలాగే ఉండాల్సి వస్తుంది... భరించడం కష్టం అంటున్న ఇలియానా?

సినీనటి ఇలియానా( Ileana ) ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే ఈమెకు తర్వాత సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

 Actress Ileana Shares Emotional Post About Her Son, Ileana, Koa Dolan, Tollywoo-TeluguStop.com

ఇక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఇలియానా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తాను తల్లి కాబోతున్నాను అనే విషయాన్ని ప్రకటించారు.దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అసలు ఇలియానా ఎప్పుడు పెళ్లి చేసుకుంది అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.

అయితే ఈమె ప్రెగ్నెన్సీ సమయంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా తన ప్రెగ్నెన్సీకి కారణమైనటువంటి వ్యక్తి గురించి తెలపలేదు కానీ తన ప్రియుడి ఫోటోని మాత్రం షేర్ చేశారు.అయితే వీరిద్దరికి పెళ్లి జరిగిందా లేదా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే.

Telugu Devadasu, Ileana, Ileana Son, Koa Dolan, Tollywood-Movie

ఇక ఇలియానా పండంటి బాబుకి జన్మనిచ్చిన విషయం మనకు తెలిసింది ఈ బాబుకి కో ఫోనిక్స్ డోలన్ ( Ko Phonics Dolan ) అనే నామకరణం కూడా చేశారు.ఇక బాబు పుట్టిన తర్వాత ఇలియానా తన కుమారుడి ఆలనా పాలన చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను ఇలియానా అభిమానులతో పంచుకుంటున్నారు.తాజాగా తన కొడుకుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Telugu Devadasu, Ileana, Ileana Son, Koa Dolan, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఒక ఫోటోలో బాబుతో ఉన్నటువంటి ఇలియానా ఈ ఫోటోని షేర్ చేస్తూ…ఈ బాధని ఎదుర్కోవడం గురించి మనకి ఎవరు నేర్పించారు.ఇది ఎంతో కష్టంగా ఉంటుంది అంటూ ఇలియానా ఈ ఫోటో షేర్ చేసారు.అలాగే మరొక ఫోటోని కూడా ఈమె షేర్ చేస్తూ రోజంతా బాబుని ఎత్తుకొని ఉండాల్సి వస్తుంది.నాకు కూడా ఈ చిట్టి కౌగిలింతలు అవసరం అంటూ మరొక ఫోటో కూడా షేర్ చేశారు.

ప్రస్తుత ఈమె తన కొడుకు గురించి షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు వైరల్( Ileana Son Photos ) అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube