టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ అందుకున్న అజిత్ కూతురు!

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు.

అయితే వీరందరూ తెలుగువారు కాకుండా ఇతర భాషల నుంచి వచ్చే తెలుగులో అద్భుతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకుంటున్నారు.

ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది కన్నడ మలయాళ బామలు తమదైన శైలిలో వరుస అవకాశాలతో దూసుకు పోతున్నారు.ఈ క్రమంలోని ఈ లిస్టులో కి మరొక మలయాళ బ్యూటీ వస్తున్నట్లు తెలుస్తుంది.

నటుడు అజిత్ కూతురిగా ఎంతవాడు గానీ, విశ్వాసం వంటి సినిమాలలో నటించిన అనిఖా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుంది.ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం పెద్దఎత్తున వినిపిస్తుంది.

మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి "కప్పెలా"చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Advertisement

ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నూతన డైరెక్టర్ శౌరి చంద్రశేఖర్ టీ రమేశ్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, కైతి, మాస్టర్ ఫేమ్ అర్జున్ దాస్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం అనిఖా సురేంద్రన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.కేవలం ఈ సినిమా మాత్రమే కాకుండా నాగార్జున కాజల్ అగర్వాల్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి చిత్రంలో కూడా అనిఖా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు