బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అలియా భట్ ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.
ప్రస్తుతం పాపకు సంబంధించిన బాధ్యతలను చూసుకుంటూ హౌస్ కీ పరిమితమయింది అలియాభట్.తన కూతుర్ని చూసుకుంటూ మాతృత్వం మధురిమలను ఆస్వాదిస్తోంది.
కాగా అలియా భట్ కూతురి పేరు రేహాకపూర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.తన కూతురితో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు రన్బీర్ కపూర్.
ఇక ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన శరీరంలోని మార్పులను మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆలియా భట్.ఇది ఇలా ఉంటే తాజాగా ఆలియా భట్ కు సంబంధించిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది.ఆ ఫోటోలో అలియా భట్ ఎరుపు రంగు చీరను ధరించి బిడ్డకు పాలు ఇస్తున్నవులు చిందిస్తోంది.అయితే ప్రస్తుత రోజుల్లో అందం పోతుంది,వయసు కనిపిస్తుంది అంటూ సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనిస్తున్న రోజుల్లో సహజ పద్ధతిలో బిడ్డను కనడం మాత్రమే కాకుండా మాతృత్వాన్ని పెంచే తల్లిపాలు ఇస్తున్నందుకు ఆలియా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.

అయితే ఈ ఫోటోను చూసిన ఇంకొందరు అభిమానులు అందులో ఉన్నది ఆలియా కాదని ఆ ఫోటో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ ఈ ఫోటో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇకపోతే అలియా భట్,రన్బీర్ కపూర్ ఇటీవలే బ్రహ్మాస్త్రం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
అలాగే ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే.







