టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు హాట్ కామెంట్స్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజల్లో విరక్తి వచ్చిందన్నారు.

 Tdp Leader Ayyannapatra Hot Comments-TeluguStop.com

అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించడం, అడ్వైజర్ల సలహాలు అన్నీ దోచుకోవడానికేనని విమర్శించారు.రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్న ఆయన ఇసుక మాఫియా, మద్యం మాఫియా రెచ్చిపోతుందని పేర్కొన్నారు.

టీడీపీ చేస్తున్న మంచి పనులపై వైసీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వ టీచర్స్ తో పాటు ఉద్యోగులు సైతం విసిగిపోయి ఉన్నారని చెప్పారు.

రాష్ట్రం అప్పుల్లో కురుకుపోయిందని, పరిశ్రమలు సైతం వెనక్కి వెళ్లిపోతున్నాయని మండిపడ్డారు.ప్రజలంతా చంద్రబాబు వైపు ఆశగా చూస్తున్నారని వెల్లడించారు.

రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube