సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయాయి.ప్రేమించి పెళ్లి చేసుకున్న కొందరు సెలబ్రిటీ జంటలు కలిసి కొద్ది రోజులు కూడా జీవించకుండానే విడాకులు తీసుకుని విడిపోతున్నారు.
కొందరు ఏళ్ల తరబడి కాపురం చేసి చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోతున్నారు.ఇటీవల కాలంలో సెలబ్రిటీల విడాకుల విషయాలు రేపుతున్నాయి.
తాజాగా ఒక నటుడు కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి వివాహ బంధానికి స్వస్తి పలికారు.ఆ నటుడు మరెవరో కాదు ప్రముఖ మలయాళం నటుడు మ్యూజిక్ డైరెక్టర్ వినాయకన్( Vinayakan ).
తాజాగా వినాయకన్ తన భార్య భబితకు( Bhabita ) విడాకులు ఇచ్చినట్లు తెలిపారు.తాజాగా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన వినాయకన్ మాట్లాడుతూ.నేను మలయాళ నటుడు వినాయకన్ ను.నాకు నా భార్యకు ఉన్న దాంపత్య బంధం ఇంతటితో ముగిసింది అని తెలిపారు.కాగా గత ఏడాది వినాయకన్ మీటూ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.మీటూ ఉద్యమం అంటే ఏమిటో మీకు తెలియదు.ఒక మహిళను నాతో శృంగారం చేస్తావా? అని అడగడం మీటూ అయితే నేను దానిని అలాగే కొనసాగిస్తాను.నిజంగా అదే మీటూ అయితే జీవితంలో ఇప్పటివరకు పదిమంది మహిళలతో శారీరక సంబంధం కలిగి ఉన్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వినాయకన్.
అయితే వినాయకన్ మాట్లాడిన మాటలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా వినాయకన్ 2019లో కూడా మృదులాదేవి( Mriduladevi ) అనే ఒక దళిత మహిళపై అసభ్యకరమైన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొని అరెస్ట్ జైలుకు వెళ్లి వచ్చి సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వినాయకన్ పాన్ ఇండియా మూవీ అయినా జైలర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆఖరి దశలో ఉంది.