పెద్దవారు కాబట్టి సరిపోయింది.. లేకుంటే నేనేంటో చూపించేవాడిని: సీరియల్ ప్రభాకర్

మా ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా రచ్చ కొనసాగుతోంది.ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోయిన తర్వాత మరింత వేడి రాజుకుంటుంది.

మరో పక్క మంచు విష్ణు ప్యానెల్ సంబరాలు చేసుకుంటున్నారు.అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ మాత్రం అందరూ షాక్ అయ్యేలా సంచలనం రేపుతున్నారు.

మొన్నటి ఎన్నికల్లో 11 మంది సభ్యులు మా అసోసియేషన్ నుంచి గెలిచారు.అందులో శ్రీకాంత్, ఉత్తేజ్, బెనర్జీ లాంటి సీనియర్స్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి కీలక పదవుల్లో గెలిచారు.

కానీ తాజా పరిణామాల దృష్ట్యా ఇప్పుడు గెలిచిన సభ్యులంతా రాజీనామా చేసారు.దాంతో అసలు సమస్య మొదలైంది.

Advertisement

మంచు విష్ణు మా అసోసియేషన్‌కు మంచి చేయాలంటే తాము అక్కడ ఉండకూడదని.ఎందుకంటే తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు తమకు కూడా ఉంటుందని.

అలా అడిగినపుడు పనులు జరగవంటూ బాధ పడుతున్నారు మా సభ్యులు.మళ్లీ గొడవలు మొదటికే వస్తాయి కాబట్టి రాజీనామా చేయడమే మంచిదనే నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానెల్ చెప్పారు.

జరిగిపోయిన ఎలక్షన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.కానీ రిజైన్ చేయడానికి అది ఒక కారణం అని బుల్లితెర నటుడు ప్రభాకర్ అన్నారు.

ఎలక్షన్ రోజున బెనర్జీ అన్న కళ్ళల్లో నీళ్ళు చూసినపుడు రక్తం మరిగి పోయింది.కానీ అవతల వారు నాకంటే పెద్ద వారు, తండ్రి లాంటి వ్యక్తి ఏం చేయగలను నేను.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఈ ఇండస్ట్రీలో మనం ఒకరికి ఎదురు మాట్లాడితే 20 ఏళ్లు వెనక్కి వెళ్ళమని ఆయన అన్నారు.ఇంతకుముందే తనకు అనుభవం అయిందని, తప్పు చేయకున్నా మనం ఎదురు మాట్లాడితే వెనక్కి వెళ్తా ఉంటాం అని ప్రభాకర్ తెలిపారు.కొండని ఢీ కొట్టాలంటే అంతా ఈజీ కాదు.వేల మందిలో ఒకరికి సాధ్యం ఆవుతుంది.

Advertisement

నేనున్నాను, నా పిల్లలున్నారు.ఇండస్ట్రీకి వస్తున్నారు.

అన్న ఒక భయం.వదిలేశామిక అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇక మా ఎన్నికల ఫలితాల గురించి ఆయన మాట్లాడుతూ, 2,3 గెలుపుల తర్వాత కౌంటింగ్ ఆపేశారు అని ఆయన వాపోయారు.

ప్రపంచంలో ఎక్కడా ఎలాంటివి జరిగి ఉండవు అని ప్రభాకర్ తెలిపారు.సగం రిజల్ట్ చెప్పి కౌంటింగ్ నిలిపి వేయడం అసలు ఎక్కడా జరగదని, అది కూడా తమకు మెజారిటీ సీట్స్ వస్తున్నాయని అలా చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

కౌంటింగ్ ఆపేశాక అందరూ వెళ్ళిపోయారు.అనౌన్స్మెంట్ కూడా చేశారు.అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు.

నేను కూడా అక్కడే ఉన్నాను.పోస్టల్ బ్యాలెట్లు తీసుకొని వెళ్తున్నారు.

సర్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు.నా ముందు ఇక్కడ లాక్ చేయమని అడిగినట్టు ఆయన తెలిపారు.

దానికి ఆయన లేదండి నాకు ఆ హక్కు ఉంది.నేను తీసుకెళ్తున్నాని అన్నారని ప్రభాకర్ చెప్పారు.

తాజా వార్తలు