తీవ్ర విషాదంలో నాగబాబు.. ఎందుకంటే.. ?

నేటి కాలంలో మనిషి జీవితం నీటి మీది బుడగలా మారిపోయింది.అసలే మరణానికి సమయం లేదని తెలుసు.

అందులో కరోనా వచ్చాక యమ ధర్మరాజుకు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు కావచ్చూ.ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ మరణాల వల్ల యమలోకం ట్రాఫిక్‌తో నిండిపోయిందని ఊహించుకోక తప్పదు.

Actor Nagababu, Deep Tragedy, Ambati Raja, Directing Department, Died, Corona Ep

మరి అంతలా కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించింది.ఇకపోతే చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది.

ముఖ్యంగా నాగబాబు తీవ్రమైన విషాదంలో మునిగిపోయారట.దీనికి కారణం కరోనా వల్ల నాగబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న అంబటి రాజా మరణించడం.

Advertisement

ఇకపోతే ఈయన కొన్ని చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పని చేసినట్లుగా సమాచారం.అంబటి రాజా మరణం పట్ల తీవ్రమైన దిగ్బ్రాంతికి గురైన నాగబాబు నిన్ను కోల్పోవడం నాలో కొంత భాగాన్ని కోల్పోవడం లాంటిది.

మై డియర్ రాజా నిన్ను ఎప్పటికీ మరచిపోకుండా గుర్తుంచుకుంటా అంటూ ఆయన సోషల్ మీడియాలో తన సంతాపం వ్యక్తపరిచారు.

Advertisement

తాజా వార్తలు