జగన్‌కు నాకు గొడవలు పెట్టాలని చూస్తున్నావ్ కదా.. ఆర్కేకు గట్టి షాక్ ఇచ్చిన మోహన్ బాబు?

ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వహిస్తున్నటువంటి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు.ఈ కార్యక్రమం ద్వారా చాలా మందిని ఇంటర్వ్యూలు చేస్తూ మంచి గుర్తింపు పొందారు.

 Actor Mohan Babu Serious On Abn Radhakrishna Open Herat With Rk Promo, Jagan, M-TeluguStop.com

అయితే ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువగా సినిమా సెలబ్రిటీల కన్నా పొలిటికల్ ఇంటర్వ్యూలు ప్రత్యేకించి ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీలకు అనుకూలంగా ఉంటాయంటూ ఈ కార్యక్రమం పై ఎన్నో విమర్శలు.ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం తాజాగా మూడవ సీజన్ ప్రారంభించింది.

ఈ క్రమంలోనే మూడవ సీజన్ ప్రారంభం కాగానే రాధాకృష్ణ వైయస్సార్ షర్మిలను ఇంటర్వ్యూ చేశారు.రెండవ ఎపిసోడ్ లో భాగంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వచ్చారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా వీరిద్దరి మధ్య ఎంతో ఆసక్తికరమైన సన్నివేశాలు జరిగినట్లు తెలుస్తోంది.ఈ ప్రోమోలో పాల్గొన్న మోహన్ బాబు తనదైన శైలిలో ఆర్కేకు చెమటలు పట్టించారని చెప్పవచ్చు.

అయితే గతంలో ఒకసారి ఆర్ కె, మోహన్ బాబు ఇంటర్వ్యూ చేయగా ఆ ఇంటర్వ్యూలో మోహన్ బాబు రాధాకృష్ణ ఉద్దేశిస్తూ నీకు కులగజ్జి.కుల పిచ్చి అంటూ అతనిని ఓ ఆట ఆడుకున్నారు.

అయితే తాజాగా ఇంటర్వ్యూలో కూడా రాధాకృష్ణకు మోహన్ బాబు నుంచి అదే పరిస్థితి ఎదురైంది.ఈ ఇంటర్వ్యూలో భాగంగా మొదట్లో ఎంతో సరదాగా ముచ్చటించినప్పటికీ రాధాకృష్ణ తరువాత అసలు సిసలైన ప్రశ్నలను అడిగారు.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో మీరు కోరుకున్న మీ దగ్గర బంధువు ముఖ్యమంత్రి అయ్యాడు కదా… మీకు టీటీడీ చైర్పర్సన్ పదవి ఇస్తారు అని అందరూ భావించారు… అది లేనప్పటికీ సొంత కాలేజీల గురించి గుక్కపట్టి ఏడవాల్సిన పరిస్థితి ఎదురైంది అంటూ ప్రశ్నించారు.

ఇలా ఆర్కె ప్రశ్నలపై ప్రశ్నలు వేయడంతో మోహన్ బాబు ఆగండి అంటూ అనడంతో మీకు ముఖ్యమంత్రి భయం ఉందా అనడంతో మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే చంద్రబాబు హయాంలో ఫీజులు చెల్లింపులో ఆలస్యం జరిగితే రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారంటూ టిడిపి ప్రభుత్వం పై ఉన్న సానుభూతిని బయటకు పెట్టడంతో కోపం తెచ్చుకున్న మోహన్ బాబు మీరు చంద్రబాబు మనిషే…అని అనగా చంద్రబాబు గోంగూర ఇవన్నీ విని విని అలసిపోయా అంటూ ఆర్కె చెప్పడంతో మీరు కచ్చితంగా నాకు జగన్ కు గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అనడంతో అవును జగన్ కు నాకు పులివెందులలో గట్టు పంచాయతీ ఉందంటూ ఈ ప్రోమో ఆర్కే దండం పెట్టినట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు ఆర్.కేకి చుక్కలు చూపించారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube