తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు జగపతిబాబు( Actor Jagapathi Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ తరహా సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
వరుస సినీ అవకాశాలతో దూసుకుపోతున్నాడు జగపతిబాబు.అంతే కాకుండా ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చిన అందులో విలన్ క్యారెక్టర్( Villain Role ) లలో జగపతిబాబు ని నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇంతకుముందు హీరోగా నటించినప్పుడు వచ్చిన గుర్తింపుతో పోల్చుకుంటే విలన్ గా నటించినప్పుడు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జగపతి బాబు సలార్( Salaar ) తో పాటు గుంటూరు కారం చిత్రంలో కూడా నటిస్తున్నాడు.ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు జగపతి బాబు.సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు.
తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.విమానం లో ప్రయాణం చేస్తున్న ఫోటోని నేను చేస్తూ అందులో మొదటిసారిగా మొదటి ప్రయాణికుడిగా ఎక్కానని చెప్పుకొచ్చాడు.
నా జీవితంలో ఫస్ట్ టైమ్ మొదటి ప్యాసింజర్‌గా విమానం ఎక్కాను.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ చెప్పిన చెప్పిన డైలాగ్ ఒకటి గుర్తుకొస్తుంది.విమానం ఎగురుతుంది కానీ.నువ్వు కాదు.
నువ్వు సీట్లో కూర్చుంటావ్ అంతే అంటూ త్రివిక్రమ్( Trivikram ) చెప్పిన ఈ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం.ఒక్క డైలాగ్‌తో జీవితం మొత్తాన్ని చెప్పాడు అని జగపతి బాబు రాసుకొచ్చారు.
ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటో వైరల్ గా మారింది.