హాలీవుడ్ సినిమాలో నటించనున్న హృతిక్ రోషన్

బాలీవుడ్ ప్రిన్స్ గా, సూపర్ హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు హృతిక్ రోషన్.

లుక్స్, శరీరాకృతి విషయంలో బాలీవుడ్ ఇతర హీరోలకి భిన్నంగా ఉండటంతో పాటు, స్టైలిష్ ఐకాన్ గా కనిపించే హృతిక్ రోషన్ కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇండియన్ సూపర్ హీరో క్రిష్ గా చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరిని అలరిస్తున్న హృతిక్ రోషన్ త్వరలో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.దీనికి సంబంధించి బిటౌన్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లోకి అతి కొద్ది మంది నటులు మాత్రమే ఎంట్రీ ఇచ్చారు.దశాబ్దాల క్రితం అమ్రిష్ పురి ఇండియానా జోన్స్ సిరీస్ లో తెరకెక్కిన ఒక సినిమాలో విలన్ గా నటించాడు.

అమ్రిష్ పురి తమ్ముడు ఓంపురి కూడా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.అనిల్ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ కూడా హాలీవుడ్ సినిమాలలో నటించారు.

Advertisement

అలాగే హీరోయిన్స్ విషయంకి వస్తే ఐశ్వర్య రాయ్, ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునే హాలీవుడ్ లోకి అడుగు పెట్టారు.అయితే హృతిక్ రోషన్ మాత్రం నేరుగా ఒక సినిమాలో మెయిన్ లీడ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ హృతిక్ రోషన్ హీరోగా పవర్ ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.దీనికి సంబంధించి ఇప్పటికే హృతిక్ తో సందరు నిర్మాణ సంస్థ చర్చలు జరపడం, ఆడిషన్స్ తీసుకోవడం, ఫైనల్ చేయడం అంతా జరిగిపోయిందని తెలుస్తుంది.

వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు