చాల సార్లు విలక్షణ నటులు అనగానే తెలుగు లో ఎవరు ఉన్నారు అని వెతుకుతూ ఉంటాం కానీ మన నటుల్లో ఉన్న చాల మందిని గుర్తించడం లేదు.ఆలా ఎంత విలక్షణత ఉన్నప్పటికీ ఇంకా సరైన పాత్ర దొరకని నటుల్లో హర్షవర్ధన్ కూడా ఒకడు.
నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి నటన చాల అద్బుతమగా ఉంటుంది.అయన తర్వాత అంత చక్కగా నటించగల నటుడు ఒక్క హర్షవర్ధన్ మాత్రమే.
తరుణ్ నటించిన చిరుజల్లు సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు హర్షవర్ధన్.ఇప్పటికే 30 వైరైటీ పాత్రల్లో 65 సినిమాల్లో నటించిన హర్ష తెలుగులోనే కాకుండా హిందీ మరియు తమిళ సినిమాల్లో కూడా నటించాడు.
ఇక సినిమాలు మాత్రమే కాదు సీరియల్స్ లో కూడా హర్షవర్ధన్ నటించాడు.అందులో ముఖ్యంగా దూరదర్శన్ లో వచ్చిన రుతు రాగాలు, అలాగే జెమినీ టీవీ లో వచ్చిన అమృతం సీరియల్స్ చాల ఫెమస్.
అమృతం సీరియల్ లో గుండు హనుమంత రావు కలిసి అయన పండించిన హాస్యం వల్ల చాల ఏళ్ళ పాటు ఆ సీరియల్ నడిచింది.ఆ తర్వాత ఈటీవీ, జీ లో చాల సీరియల్స్ లో నటించారు.
ఇక హర్షవర్ధన్ లో నటన, కామెడీ మాత్రమే కాదు మంచి రైటర్ కూడా ఉన్నాడు.గుండె జారీ గల్లంతయ్యిందే, మనం వంటి సినిమా లకు స్క్రిప్ట్ రాయడం తో పాటు డైలాగ్ రైటర్ గా కూడా పని చేసాడు.
మనం సినిమాకు గాను బెస్ట్ సంతోషం డైలాగ్ రైటర్ గా అవార్డు కూడా అందుకున్నాడు హర్షవర్ధన్.ఇక ఈ మధ్య వచ్చిన సేనాపతిలో అతడి నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఇక లీడర్ సినిమాలో సైతం రానా పక్కన ఉంటూ చాల చక్కగా తన వంతు న్యాయం చేసాడు.ఇక తనదైన పాత్ర వస్తే ఎంతో బాగా ఇంకా నటించి తనను తాను ప్రూవ్ చేసుకోగల సత్త ఉన్న నటుడు.
కానీ ఎందుకో చాల ఏళ్లుగా ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ ఇంకా అలంటి ఒక పాత్ర దొరకలేదని చెప్పాలి.ఇప్పటికే 40 ఏళ్ళు దాటినా ఇంకా హర్ష వర్ధన్ పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉన్నాడు.