జొన్న పంట( Sorghum Cultivation ) వర్షాధార పంటగా అధిక విస్తీర్ణంలో సాగు అవుతోంది.రబీ ఆరుతడి పంటల్లో జొన్న ముఖ్యమైనది.
సాధారణంగా జొన్న పంటను సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు విత్తుతారు.జొన్న పంట ఆహార పంట మాత్రమే కాదు పశువులకు మేతగా, కోళ్లకు దాణాగా కూడా వినియోగిస్తారు.
కాబట్టి తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగు అయ్యే పంటలలో జొన్న పంట కూడా ఒకటి.అయితే జొన్న పంట విత్తడంలో ఆలస్యం జరిగితే జొన్న పంటకు మొవ్వు తొలుచు ఈగల బెడద చాలా ఎక్కువ.
జొన్న పంట లేత దశలో ఉన్నప్పుడు ఈ ఈగలు పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.తొలి దశలోనే ఈ ఈగలను గుర్తించి నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంది.

ఒక ఎకరానికి 18 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చే జొన్న రకాలు అందుబాటులోకి వచ్చాయి.కాబట్టి రైతులు జొన్న పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకుని సాగుచేపడితే మంచి లాభాలు పొందవచ్చు.

ఈ మొవ్వుతోలుచు ఈగలను పంట పొలంలో గుర్తించిన తర్వాత జొన్న మొక్క ఆకు సుడిలో పడే విధంగా కార్బో ఫ్యూరాన్ 4జీ గుళికలను ఇసుకలో కలిపి వేయాలి.జొన్న పంటలో అధిక దిగుబడులు( High yields ) సాధించాలంటే.మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలేటట్టు మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉండేటట్లు విత్తాలి.విత్తిన నెల రోజుల లోపు పొలంలో అంతర కృషి చేపట్టాలి.
కలుపు మొక్కలు ఏమైనా ఉంటే పూర్తిగా తొలగించాలి.మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకుని వాటిని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత విత్తుకుంటే భూమి నుంచి వివిధ రకాల తెగుళ్లు పంటను ఆశించే అవకాశం చాలా తక్కువ.







