యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎన్నో సినిమాలతో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
సౌత్ లో తెలుగు, తమిళ్ , కన్నడ బాషలలో అర్జున్ హీరోగా నటించి ప్రూవ్ చేసుకున్నాడు.కోడి రామకృష్ణ అర్జున్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు.
అలాగే శంకర్ దర్శకత్వంలో చేసిన జెంటిల్మన్, ఒకే ఒక్కడు సినిమాలు ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్ మూవీస్ గా నిలిచిపోయాయి.అలాగే అర్జున్ హీరోగానే కాకుండా దర్శకుడుగా కూడా కొన్ని హిట్ సినిమాలు చేశాడు.
ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
తమిళంలో అభిమాన్యుడు, తెలుగులో లై సినిమాలతో విలన్ గా మెప్పించి ఆకట్టుకున్నాడు.ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోలకి పోటీ ఇచ్చే విలనీ పాత్రల కోసం అర్జున్ కేరాఫ్ గా మారిపోయాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు అర్జున్ కూడా హోస్ట్ గా మారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.అది తమిళంలో హోస్ట్ గా తన కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సర్వైవర్ షోని ఇప్పుడు తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు.ఈ షోకోసం నిర్వాహకులు హోస్ట్ గా యాక్షన్ కింగ్ అర్జున్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది.
జీ తమిళ్ లో ప్రసారం కాబోయే ఈ రియాలిటీ షో షూటింగ్ సెప్టెంబర్ లో జరుగుతుందని సమాచారం.మరి బుల్లితెరపై ఈ యాక్షన్ కింగ్ హోస్ట్ గా ఎలా మెప్పిస్తాడు అనేది చూడాలి.