ఆచార్యకు పెద్ద టార్గెట్ ఇచ్చిన అక్కడి ప్రేక్షకులు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.ఈ సినిమాను గతేడాదే ప్రారంభించినా, కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతూ వచ్చింది.

 Acharya Overseas Target Is Huge, Acharya, Chiranjeevi, Koratala Siva, Tollywood-TeluguStop.com

ఇక ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను సోషల్ అంశాలతో తనదైన శైలిలతో కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఆచార్య చిత్రంపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాకు టాలీవుడ్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఇప్పటికే చిత్ర యూనిట్ భారీ రేటుకు అమ్మేసిందని, ఈ లెక్కన ఈ సినిమా అక్కడ భారీ మొత్తంలో వసూళ్లు చేయాల్సిన పరిస్థితి నెలకొందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

అసలే చాలా రోజుల తరువాత చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమాను ఓవర్సీస్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తుండటంతో ఆచార్య చిత్రం కోసం అక్కడి ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు.ఇక ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా రూ.11 కోట్ల రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

కరోనా తరువాత ఓవర్సీస్‌లో ఈ రేంజ్‌లో రైట్స్ అమ్ముడు కావడం ఒక్క ఆచార్యకే సాధ్యం అయ్యింది.

ఇక ఈ సినిమాలో చిరంజీవి పర్ఫార్మెన్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేమియో రోల్, కాజల్ అందాలు కలగలిసి ఆచార్యపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.కాగా ఈ సినిమాను నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఈ సినిమాకు సంగీతం మణిశర్మ అందిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.వేసవి కానుకగా మే 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube