తెలంగాణలోని గొర్రెల కుంభకోణం కేసులో దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది.కాంట్రాక్టర్ మోహియుద్దీన్,( Contractor Mohiuddin ) పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు విక్రమ్, శివసాయిలను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.
కాగా 120 యూనిట్ల గొర్రెలను కాంట్రాక్టర్ ఏపీకి చెందిన రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారని తెలుస్తోంది.అయితే రూ.2.10 కోట్లు రైతులకు చెల్లించకుండా కాంట్రాక్టర్ బినామీ ఖాతాలోకి మళ్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో కాంట్రాక్టర్ కు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు సహకరించారని దర్యాప్తులో తేలినట్లు సమాచారం.అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతోనే గొర్రెలు కొన్నారని రైతులు ఆరోపిస్తున్నారు.మరోవైపు గొర్రెల కుంభకోణంలో భారీగా అవినీతి జరిగిందని ఇప్పటికే కాగ్ రిపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తలసానితో పాటు ఓఎస్డీ కల్యాణ్ పాత్రపై ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు.







