ప్రస్తుత యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) కఠినంగా వలసల్ని అరికడుతున్నారు.ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే, సర్కార్ చాలా మంది భారతీయుల్ని( Indians ) వెనక్కి పంపించింది.
వీళ్లంతా అమెరికా( America ) సరిహద్దులు దాటి చట్టవిరుద్ధంగా వెళ్లినవాళ్లు.వాళ్ల చేతులు, కాళ్లు కట్టేసి ఇండియాకు పంపించేశారు.
అయితే వాళ్ల పట్ల జాలి చూపించడానికి బదులు, వారిని చాలా మంది తిట్టిపోస్తున్నారు, వాళ్ల కుటుంబాల్ని కూడా వదలట్లేదు.ఎందుకంటే, వాళ్లు ఇండియా గవర్నమెంట్‌ను అప్పులు మాఫీ చేయమని,( Loan Waiver ) ప్రభుత్వ ఉద్యోగాలు( Government Jobs ) ఇవ్వమని అడుగుతున్నారు.
దీంతో సోషల్ మీడియాలో జనాలు మండిపడుతున్నారు.

నెటిజన్లు అయితే వాళ్లను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ, “వేరే దేశంలో చట్టాలు అతిక్రమించారు, అక్కడ ఏదో ఘనకార్యం చేసినట్లు ఇక్కడ రివార్డులు కావాలంటారా? ఇది అస్సలు ఒప్పుకోం” అన్నారు.మరోకరు, “అప్పులు మాఫీ చేయమని, ఉద్యోగాలు అడగడం బదులు, చేసిన తప్పుకు బాధ్యత వహించాలి.
ఇది చాలా తప్పుదారి చూపేలా ఉంది” అని రాశారు.

కొందరు అయితే కామెడీ చేస్తున్నారు.ఒకతను జోక్ చేస్తూ, “నేను కూడా డీపోర్ట్( Deport ) అయితే బాగుండు.అప్పులు తీర్చే కొత్త దారిలా ఉంది.
” అన్నాడు.ఇంకొకతను సెటైర్ వేస్తూ, “నెక్స్ట్ టైమ్ నేను లోన్ కట్టకపోతే, డీపోర్ట్ అయ్యాక వచ్చే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నానని బ్యాంకులో చెబుతా” అని కామెంట్ చేశాడు.
జనాలు మండిపడటం కరెక్టే అయినా, చాలా మంది భారతీయులు ఇట్లాంటి రిస్క్‌లు తీసుకోవడానికి కారణం ఇండియాలో అవకాశాలు లేకపోవడమే.మంచి భవిష్యత్తు కోసం వాళ్లు ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు.
దీన్ని రాజకీయ రాద్ధాంతం చేయకుండా, ఇండియన్ గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు పెంచడానికి చర్యలు తీసుకోవాలని కొందరు అంటున్నారు.ఇండియాలోనే బాగా సంపాదించుకుంటే, వేరే దేశాలకు ప్రాణాలకు తెగించి వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా అని అభిప్రాయపడుతున్నారు.







