బాలీవుడ్ నటినటులు ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ ( Abhishek Bacchan ) గురించి ప్రత్యేకంగా సినీ ప్రియులకు పరిచయం చేయనక్కర్లేదు.వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే .
అయితే గతంలో అభిషేక్ బచ్చన్ కంటే ముందే ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ ( Salman khan ) ని ప్రేమించి ఎన్నో రోజులు రిలేషన్ లో కూడా ఉంది.కానీ సల్మాన్ ఖాన్ టార్చర్ చేయడంతో తనకి ఎలాగైనా దూరం గా ఉండాలని అనుకొని ఎట్టకేలకు అతనికి దూరంగా వచ్చేసి చివరికి అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడి బిగ్ బి అమితాబచ్చన్ ఇంటికి కోడలుగా వెళ్ళింది.
అయితే పెళ్లైనప్పటి నుండి కోడలుగా తన బాధ్యతను ఎంతో చక్కగా నెరవేరుస్తుంది.అలాగే వీరిద్దరికి ఆరాధ్య బచ్చన్ ( Aradhya bacchan ) అనే కూతురు కూడా ఉంది.
ఇక గతంలో అభిషేక్ ఐశ్వర్య విడాకులు తీసుకుపోతున్నారంటూ నెట్టింట ఒక రూమర్ ప్రచారం జరిగింది.కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చారు.అయితే తాజాగా అభిషేక్ బచ్చన్ ఘుమర్ ( Ghoomer ) అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.నేను బయటికి పని మీద వెళ్ళినప్పుడు ఏదైనా నిరాశతో తిరిగి వస్తే ఇంట్లో ఉండే ఐశ్వర్యరాయ్ ( Aishwarya rai ) నాకు సపోర్ట్ గా ఉంటూ మీరు ఆ విషయం గురించి మర్చిపోండి.మన జీవితంలో ఎన్నో సంతోషింపజేసే విషయాలు ఉన్నాయి.
మనకు ఒక మంచి ఫ్యామిలీ కూడా ఉంది.మీకు కుటుంబాన్ని మించిన ఆనందం ఎక్కడ ఉంటుంది చెప్పండి.
అలాగే మీరు ఏ విషయం గురించి అయితే టెన్షన్ పడుతున్నారో ఆ విషయాన్ని మర్చిపోండి.దాన్ని మీ మనసులో నుండి పూర్తిగా తీసేయండి.
అలాగే కరోనా సమయంలో ఎన్నో ఫ్యామిలీలు నాశనమయ్యాయి.కానీ మనం ఇంకా ఇక్కడ ఆరోగ్యంగా ఉన్నామంటే అదృష్టవంతులం అనుకోవాలి.

ఇంతకంటే మన జీవితంలో కావాల్సింది ఏముంది అంటూ ఐశ్వర్య నేను డిప్రెషన్ లో ఉన్నప్పుడు నాకు ఈ మాట చెబుతుంది అంటూ మొదటిసారి తన భార్య గురించి అభిషేక్ బచ్చన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ గురించి అభిషేక్ బచ్చన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







