బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అభిషేక్ బచ్చన్( Abhisekh Bachchan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి అభిషేక్ త్వరలోనే రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్( Amithab Bachchan ) తల్లి జయ బచ్చన్( Jaya Bachchan ) ఇద్దరు కూడా రాజకీయాలలో కొనసాగిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్ కూడా రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ ఓ వార్త వైరల్ అయింది.

ఇక గతంలో అమితాబచ్చన్ పోటీ చేసి గెలుపొందిన ప్రయాగ్ లోక్ సభ స్థానం నుంచి అభిషేక్ బచ్చన్ ను పోటీకి నిలబెట్టాలని సమాజ్ వాద్ పార్టీ పెద్దలు నిర్ణయించారని తెలుస్తోంది.ఇలా త్వరలోనే జరగబోయే ఎన్నికలలో పోటీ చేయబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి.అయితే తాను రాజకీయాలలోకి రాబోతున్నానంటూ( Political Entry ) వస్తున్నటువంటి ఈ వార్తలపై అభిషేక్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తాను రాజకీయాలలోకి రాబోతున్నాను అంటూ వచ్చే వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇదంతా కేవలం అవాస్తవం అని తెలిపారు.

ఈ విధమైనటువంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తనకు చాలా ఆశ్చర్యం కలుగుతుందని తన రాజకీయ ఎంట్రీ గురించి అభిషేక్ బచ్చన్ స్పందించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక అభిషేక్ బచ్చన్ ఇదివరకే తన గురించి ఎలాంటి రూమర్స్ వచ్చిన వెంటనే వాటిని ఖండిస్తూ వచ్చారు.ఒకానొక సమయంలో అభిషేక్ ఐశ్వర్యరాయ్( Aishwarya ) విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై స్పందించినటువంటి అభిషేక్ తనకు రెండో పెళ్లి కూడా మీరే చేయాలి అంటూ ఘాటుగా తన విడాకుల వార్తలకు( Divorce Rumours ) చెక్ పెట్టారు.