బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్( Aishwarya rai bachchan ) గురించి మనందరికీ తెలిసిందే.ఈమె పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం.
తన అందంతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది ఐశ్వర్య.ఇది ఇలా ఉంటే ఇటీవల అనగా నవంబర్ 1న ఆమె తన 50వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది.
ఆమెకు 50 ఏళ్లు అంటే నమ్మడం కష్టమే.ఎందుకంటే 50 ఏళ్లు వచ్చినా కూడా ఆమె ఇప్పటికీ 25 ఏళ్ల యువతి లాగే కనిపిస్తూ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది.
ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే వయసుతోపాటు ఆమె అందం కూడా మరింత పెరుగుతోందని చెప్పవచ్చు.మోడల్‌గా కెరీర్ ను మొదలు పెట్టి యాక్టింగ్ కెరీర్ లోకి వచ్చి ఇండియన్ స్టార్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఐశ్వర్య రాయ్ పుట్టినరోజు కావడంతో అభిమానులు సెలబ్రిటీలు పెద్ద పెద్ద ప్రముఖులు ఆమెకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.50వ పుట్టినరోజు వేడుకలను ఐశ్వర్య ప్రత్యేకమైన వ్యక్తులతో సెలబ్రేట్ చేసుకుంది.తన తల్లి బృందా రాయ్, ( Brunda Rai )కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో క( aaradhya bachchan )లిసి క్యాన్సర్ రోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేక్ కట్ చేసి గ్రాండ్ గా జరుపుకున్నారు.
ఐశ్వర్య ఫ్యామిలీలోని మూడు జెనరేషన్ మహిళలు కలిసి కేక్ కట్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social media ) లో వైరల్ గా మారాయి.ఇక ఆ పుట్టినరోజు వేడుకలో ఐశ్వర్య కూతురు ఆరాధ్య మాట్లాడుతూ.అమ్మ నువ్వు చేసే సేవ కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవి.
ఎంతో అద్భుతమైనవి.నీ చుట్టూ ఉండే వారికీ, ప్రపంచంలోని ఇంకెంతోమంది ప్రజలకు నువ్వు చేసే సహాయం నిజంగా నమ్మశక్యం కానిది అని వ్యాఖ్యానించింది.
కూతురి మాటలకూ ఐశ్వర్య ఆనందంతో పొంగిపోయింది.ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ స్వీట్ మామ్ అండ్ డాటర్ అంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.