ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు విశ్వాస పరీక్షకు సిద్ధమైనట్లు ఆయన వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టారు.ఆయన ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై రేపు చర్చ జరగనుంది.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈడీ వరుస నోటీసుల నేపథ్యంలో కేజ్రీవాల్ విశ్వాస తీర్మానాన్ని పెట్టారని తెలుస్తోంది.

ఇన్ని సంవత్సరాల్లో మళ్లీ ఆపరేషన్ లోటస్ కోసం బీజేపీ ( BJP )ప్రయత్నించిదన్న కేజ్రీవాల్ తమ ఎమ్మెల్యేలు తిరస్కరించారని పేర్కొన్నారు.మద్యం కుంభకోణం పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.రాష్ట్రాల్లో పార్టీలను చీల్చుతూ ప్రభుత్వాలను కూలగొడుతున్నారని మండిపడ్డారు.
లిక్కర్ స్కాం పేరుతో ఆప్ నేతలను జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు.అయితే తమ ఎమ్మెల్యేలు ఎవరూ పక్క చూపులు చూడటం లేదని, అందరూ తమ ప్రభుత్వంతోనే ఉన్నారని తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ప్రజలకు నమ్మకం కలిగించేందుకు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.







