డిల్లీ రాజకీయం రోజు రోజుకు వేడెక్కిపోతుంది…ఏ పార్టీ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు డిల్లీ నాయకులు.ఇదిలా ఉంటే బీజేపీ.
ఆప్ ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికలపై యావత్ భారత దేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.ఇక ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి, ఆప్ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్‌ను చిత్తు చేసేందుకు బిజెపి అధినాయకత్వం వ్యూహప్రతివ్యహాలు పన్నుతుంది.
అందులో భాగంగానే ఐపిఎస్ మాజీ అధికారి కిరణ్ బేడిని పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దింపగా, తాజాగా అరవింద్ కేజ్రివాల్‌పై యువ మహిళా అభ్యర్థి నుపుర్ శర్మ ను రంగంలోకి దింపింది.లండన్ ఆర్థిక పాఠశాలలో చదివి వచ్చిన ఉన్నత విద్యావంతురాలు ఆమె.అయితే అరవింద్ కేజ్రివాల్‌పై నుపుర్ శర్మను పోటీకి దించటం ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన కొత్త ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని మహిళలు, విద్యావంతుల ఓట్లను సంపాదించుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది.ఆమె గతంలో బిజెపి యువజన విభాగంలో పనిచేసి.
విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పలుమార్లు విజయం సాదించారు.ఇక బిజెపి రంగంలోకి దించిన ఇద్దరు మహిళా అభ్యర్థుల మధ్య కేజ్రివాల్‌కు ఊపిరాడటం లేదు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
మరి దీన్ని ఎదుర్కునేందుకు అప్ ఎలాంటి ప్లాన్ చేస్తుందో చూడాలి.







