రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా రాష్ట్రంలో టీడీపీ పార్టీ పరిస్థితి మరింత హీనంగా మారిపోయింది.గతంలో అయితే ఆ పార్టీ కోసం పోరాడి పార్టీతో సాగిన నేతలు ఉండేవారు.
అలాంటిది ఇప్పుడు ఎవరికి వారు ఒక్కొక్కరుగా గులాబీ దళంలో చేరిపోయి…టీఆరఎస్ కండువాలు కప్పేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే సీమాంధ్రకు పెద్ద దిక్కుగా ఉన్న చంద్రబాబు, తెలంగాణాలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని, సమస్యలపై పోరాడి, నిలబడాలని, లోకేష్ కు వివరించి, తెలంగాణా టీడీపీకి పెద్ద దిక్కుగా లోకేష్ ను నిలబెట్టే ప్రయత్నాలు తెరవెనుక చేస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణాలో లోకేష్ వ్యూహాలు పెద్దగా ఫలించడం లేదు.ప్రస్తుతానికి తెలంగాణాలో ఆయన కనుసన్నల్ళోనే టీడీపీ నడుస్తున్నా.
పాపం వలసలను మాత్రం ఆపే ప్రయత్నాలు ఏవీ లోకేష్ చెయ్యలేకపోతూ ఉండడంతో దీనిపై టీలో పార్టీలో మిగిలిన నేతలు బాబు వద్దకు వెళ్లి పార్టీ పరిస్థితి గురించి వివరించారట.ఎలాగైనా పార్టీని మీరే కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారట.
దీన్ని బట్టి చూస్తే టీ.టీడీపీకి లోకేష్ లీడర్ గా ఉండడం పాపం అక్కడి నాయకులకు రుచించడం లేదు అన్న వాదన వినిపిస్తుంది.దీనిపై చంద్రబాబు, చినబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.







