ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్( Arvind Kejriwal Arres ) నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది.ఆమ్ ఆద్మీ పార్టీకి ఇండియా కూటమి మద్ధతు ప్రకటించింది.
ఈ క్రమంలోనే ఈ నెల 25న హోలీ జరుపుకోకూడదని ఆప్ నిర్ణయం తీసుకుంది.అలాగే ఈ నెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీ( Narendra Modi ) నివాసాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని షహీదీ పార్క్ నుంచి ‘ ప్రజా ఉద్యమం’ ను ప్రారంభిస్తామని ఆప్ తెలిపింది.కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.







