'ఆదికేశవ' ట్విట్టర్ రివ్యూ.. మెగా హీరో ఖాతాలో విజయం చేరినట్టేనా?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్( Panja Vaisshnav Tej ) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదికేశవ‘( Aadi Keshava ).ఈ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

 Aadikeshava X Review, Aadikeshava Twitter Review Ratings, Sreeleela, Tollywood,-TeluguStop.com

ఎందుకంటే ఈ సినిమాలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించడంతో ఈ అమ్మడి ఫ్యాన్స్ అంత ఈ సినిమాపై ఫోకస్ పెట్టారు.దీంతో ఆదికేశవ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజ్ కానుంది.

వైష్ణవ్ తేజ్, శ్రీలీల( Sreeleela ) జోడీని తెరమీద చూడాలని అనుకునే వారికీ ఈ రోజుతో ఆ కోరిక తీరనుంది.నవంబర్ 24న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

మరి ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షో పలు చోట్ల పడగా వీక్షించిన వారు ట్విట్టర్ వేదికగా తమ రివ్యూలు ఇస్తున్నారు.

Telugu Aadikeshava, Panjavaisshnav, Sreeleela, Srikanthn-Movie

ఆ రివ్యూలను బట్టి చుస్తే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది అనే చెప్పాలి.ఉప్పెన సినిమా తర్వాత మరో సినిమాకు కనెక్ట్ అవ్వలేదు.దీంతో వైష్ణవ్ తేజ్ రేసులో వెనక్కి వెళ్ళిపోయాడు.

ఇక ఇప్పుడు మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమాకు ప్రస్తుతం పాజిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.

Telugu Aadikeshava, Panjavaisshnav, Sreeleela, Srikanthn-Movie

ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుందని కామెడీతో అలరిస్తుందని.సెకండాఫ్ మాత్రమున మాస్ యాక్షన్ తో అదిరిపోతుందని కామెంట్స్ వస్తున్నాయి.అంతేకాదు యాక్షన్ సీన్స్ లో వైష్ణవ్ తేజ్ అదరగొట్టినట్టు టాక్ వస్తుంది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సింహాద్రి, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో హిట్ సాంగ్స్ కు శ్రీలీల నెక్స్ట్ లెవల్ అని చుసిన వారంతా కామెంట్స్ చేయడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ కుమ్మేయడం ఖాయం అనిపిస్తుంది.దీంతో వైష్ణవ్ ఖాతాలో ఎట్టకేలకు ఉప్పెన తర్వాత హిట్ పడింది అనే చెప్పాలి.

కాగా ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి ( Director Srikanth N Reddy ) తెరకెక్కించాడు.జివి ప్రకాష్ ( GV Prakash ) సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube