ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్ సాంగ్.. పాయల్ అందాల రచ్చ..!

కెరియర్ లో కమర్షియల్ హిట్లు లేకపోయినా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఆది సాయి కుమార్.థియేట్రికల్ రన్ ఎలా ఉన్నా శాటిలైట్, డిజిటల్ రైట్స్ లో సినిమా ప్రాఫిట్స్ తెస్తుండటంతో ఆది సాయి కుమార్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి.

 Aadi Saikumar Tees Maar Khan Song Payal Rajput Glamour Attack Aadi Saikumar , Te-TeluguStop.com

ఈ క్రమంలో లేటెస్ట్ గా ఆది సాయి కుమార్ హీరోగా పాయల్ రాజ్ పుత్ ఫీమేల్ లీడ్ గా తీస్ మార్ ఖాన్ సినిమా వస్తుంది.ఈ సినిమా నుంచి సమయానికే సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

బీచ్ ఒడ్డున హీరో హీరోయిన్ ఫుల్ రొమాంటిక్ సాంగ్ గా ఇది ఉంది.ఇక అందాల ప్రదర్శనలో పీ.హెచ్.డి చేసిన పాయల్ రాజ్ పుత్ ఈ సాంగ్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.

ఆరెక్స్ 100 సినిమాతో హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న పాయల్ అదే క్రేజ్ తో సినిమాలు చేస్తుంది.సినిమాలే కాదు ఐటం సాంగ్స్ కి అమ్మడు ఓకే చెబుతుంది.

సీనియర్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తుంది.ఆది సాయి కుమార్ తో తీస్ మార్ ఖాన్ సినిమాలో నటిస్తున్న పాయల్ రాజ్ పుత్ తన పాత్ర వరకు ఫుల్ గా న్యాయం చేసినట్టు ఉంది.

సినిమాలో అమ్మడి గ్లామర్ షో కోసమైనా సినిమా చూసేలా ఉన్నారు ఆడియెన్స్.

సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సినిమా తర్వాత సినిమా చేస్తున్న ఆది సాయి కుమార్ ప్రస్తుతం 3 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.

అయితే తీస్ మార్ ఖాన్ మీద మాత్రం అంచనాలు ఉన్నాయి.పాయల్ అందాలే స్పెషల్ ఎట్రాక్షన్ గా వస్తున్న ఈ సినిమాని కళ్యాణ్ జి డైరెక్ట్ చేస్తున్నారు.

విజన్ సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ సినిమాని ఆగష్టు 19న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube