పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య నటి రేణు దేశాయ్(Renu desai) చాలా రోజుల తర్వాత తిరిగి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చారు.ఈమె మాస్ మహారాజ రవితేజ(Raviteja ) హీరోగా నటించినటువంటి టైగర్స్ నాగేశ్వరరావు( Tiger Nageswararao ) సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ఎంతోమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
జానీ సినిమా తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె ఇద్దరు పిల్లలకు తల్లిగా మారడం అనంతరం పవన్ కళ్యాణ్ నుంచి విడిపోవడం జరిగింది.ఇలా ఇన్ని రోజులు పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమాలో ఈమె హేమలత లవణం ( Hemalatha Lavanam ) అనే పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే ఈమెకు సంబంధించిన కొన్ని పోస్టర్స్ కూడా విడుదల చేయడంతో ఆద్యంతం ఈ సినిమాపై ఆసక్తి రేపుతోంది.ఇక ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రేణు దేశాయ్ సైతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

చాలా రోజుల తర్వాత తిరిగి ఈమె సినిమాలలో నటిస్తున్నటువంటి నేపథ్యంలో తాను నటించిన హేమలత లవణం పాత్ర గురించి తన కూతురు ఆధ్య (Aadhya) చెప్పిన అభిప్రాయాలను ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.హేమలత లవణం పాత్ర చూసిన తర్వాత ఆధ్య మాట్లాడుతూ… చాలామంది నటీనటులు వారి వయసుకు తగ్గట్టు పాత్రలు చేయరు, కానీ మీరు మాత్రం మీ వయసుకు తగ్గట్టు ఇలాంటి పాత్రలు చేస్తున్నందుకు నాకు చాలా గౌరవంగా ఉంది అమ్మ అంటూ ఆధ్య హేమలత లవణం పాత్ర గురించి తన అభిప్రాయాలను తెలియజేసింది అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







