పదేళ్లు దాటితే ఆధార్ కార్డు అప్డేట్ తప్పనిసరి.. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి..!

భారతదేశంలో( India ) నివసించే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డ్( Aadhaar Card ) కీలకం అన్న సంగతి తెలిసిందే.సిమ్ కార్డ్ కొనాలన్న, బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, వాహనాలు కొనాలన్నా, భూముల క్రయవిక్రయాలు, విద్యార్థుల స్కాలర్ షిప్, ప్రభుత్వ పథకాలు లాంటివి వాటిలో ఆధార్ కార్డు తప్పనిసరి.

2014 కంటే ముందు ఆధార్ కార్డు పొందిన వారు కచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సిందే.ఇందుకోసం ప్రభుత్వం జూన్ 14 వరకు గడువు విధించింది.

ఆధార్ కార్డు సెంటర్లలో, బ్యాంక్ లలో, పోస్టాఫీసు లలో తగిన డాక్యుమెంట్లు ఇచ్చి అప్డేట్ చేసుకోవచ్చు.ఆధార్ కార్డులో తండ్రి (సన్ ఆఫ్), భర్త (వైఫ్ ఆఫ్), చిరునామాలు లాంటి వివరాలు మార్చుకోవచ్చు.అంతేకాకుండా ఫోన్ నెంబర్లు, పుట్టిన తేదీ, ఫోటో లాంటివి కూడా అప్డేట్ చేసుకోవచ్చు.

చిన్నపిల్లలకు తల్లిదండ్రుల వేలిముద్రలతో ఆధార్ కార్డు జారీ, పిల్లలకు ఐదు సంవత్సరాలు పూర్తయ్యాక వారి వేలిముద్రలు ఫోటోలు( Fingerprints photos ) అప్లోడ్ చేయాలి.ఇంకా 70 సంవత్సరాలు పైబడిన వారు అప్డేట్ చేయించాల్సిన అవసరం లేదు.

Advertisement

ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఎటువంటి రుసుము చెల్లించకుండా జూన్ 14 లోపు అప్డేట్ చేసుకోవచ్చు.సంబంధిత వెబ్సైట్లోని ఆధార్ పోర్టల్ లో ఎం ఆధార్ యాప్ ద్వారా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.

కంప్యూటర్ పై అవగాహన ఉంటే myaadhaar.uidai.gov.in పోర్టల్ లో ఫోన్ నెంబర్ నమొదు చేస్తే ఓటీపీ వస్తుంది.

ఆ ఓటీపీ తో లాగిన్ అయి డాక్యుమెంట్ అప్డేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, అప్డేట్ చేయాల్సిన వివరాలు నమోదు చేసి, తగ్గిన ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాలి.తరువాత అడ్రస్ కోసం మరో పతాన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

వెంటనే ఫోన్ కు ఆధార్ అప్డేట్ అనే మెసేజ్ వస్తుంది.అదే మీసేవ కేంద్రాల్లో అయితే బయోమెట్రిక్ అప్డేట్ కు రూ.100, డెమోగ్రాఫిక్ అప్డేట్ కు రూ.50, ఆధార్ డౌన్లోడ్, కలర్ ప్రింట్ కు రూ.30 చెల్లించాలి.ఏవైనా సమస్యలు ఉంటే 1947 టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించవచ్చు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు