ఈరోజుల్లో ప్రతిభలను ప్రదర్శించడానికి రైల్వే స్టేషన్ ఒక వేదికగా మారుతోంది.చాలామంది ఇక్కడ పాటలు పాడుతున్నారు.
డ్యాన్సులు చేస్తున్నారు.స్టంట్స్ కూడా ప్రదర్శిస్తున్నారు.
ఇంకా సోషల్ మీడియా( Social media )లో ఫేమస్ కావాలని పిచ్చి చేష్టలు కూడా చేస్తున్నారు.అయితే తాజాగా వీరికి విరుద్ధంగా ఒక యువతి తన అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది.
ఈ ముద్దుగుమ్మ చాలామంది స్టేషన్‌లో ఉన్నా సరే తన డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించాలని నిర్ణయించుకుంది.అందుకే అక్కడ జనాల్ని లెక్క చేయకుండా ఆమె కిల్లర్ స్టెప్స్ వేసి అదరగొట్టింది.

ఈ టాలెంటెడ్ డ్యాన్సర్ పేరు సహేలీ రుద్ర( Saheli Rudra ).ఈమె క్రాప్ టాప్, టార్న్ జీన్స్ ధరించి రైల్వే స్టేషన్ కి వచ్చింది, వచ్చీ రాగానే నాట్యం చేయడం స్టార్ట్ చేసింది.ఆ బట్టలలో ఆమె డాన్స్ చేస్తూ ఉంటే అక్కడ నిల్చున్న ప్యాసింజర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు.తర్వాత ఆమె డాన్స్ బాగుండడంతో చూపు తిప్పుకోకుండా ఆమె వైపే చూశారు.
వారందరూ చూస్తున్నారని తెలిసిన ఈమె మాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోకుండా చక్కగా నాట్యం చేసింది.

తనతో పాటే వచ్చిన ఒక వ్యక్తి ఈ డ్యాన్స్‌ను వీడియో తీశాడు.అనంతరం ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది చాలామంది నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంది.ఆ వీడియో చూసిన నెటిజన్స్ మిక్స్‌డ్ రియాక్షన్స్ వినిపిస్తున్నారు.
అందరు ఆమెను పొగిడితే మరి కొందరు విమర్శించారు ఇలాంటి బట్టలు బాగోలేదని, టాలెంట్ ఉంటే ఒక వేదిక చూసుకోలేదు అక్కడ డాన్స్ చేయొచ్చు కదా ఇలా జనాల్లో ఎందుకు అని మరికొందరు ప్రశ్నించారు.ఏది ఏమైనా ఆమెకు కొంతమంది మాత్రం సపోర్ట్ చేస్తున్నారు.







