ఉద్యోగాన్వేషణలో అలసిపోయిన యువకుడు, చివరకు ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు!

ఒకప్పటితో పోల్చుకుంటే, ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగులు పెరిగిపోతున్నారు.యెంత చదువుకున్నప్పటికీ ఆశించిన ఉద్యోగాలు లేక ఎంతోమంది తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు.

 A Young Man Who Is Tired Of Looking For A Job Will Be Shocked To Know What He Ha-TeluguStop.com

అయితే మరికొంతమంది మాత్రం వినూత్న రీతిలో తమకు నచ్చిన పనులు చేసుకుంటున్నారు.అయితే ఇక్కడ చెప్పుకోబోయే మనిషి ఈ రెండు వర్గాలకి సంబంధించినవాడు కాదు.

నేడు ప్రైవేటు రంగాల్లో సైతం ఆశించిన జాబ్‌లు దొరకడం గగనంగా మారిపోయింది.ఈ క్రమంలో 21ఏళ్ల యువకుడికి చేదు అనుభవం ఎదురైంది.

ఉద్యోగం ప్రయత్నంలో అలసిపోయిన ఆ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు.

దీంతో అతడు చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే, జార్జ్ కోర్నియాక్ అనే 21ఏళ్ల యువకుడు.ప్రస్తుతం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించిన ఓ కాలేజీలో ఎకనామిక్స్ చదువుతున్నాడు.

బ్యాంకింగ్, ఇన్సురెన్స్ కంపెనీల్లో పని చేసి.అందులో అనుభవం పొందాలని అనుకున్నాడు.

ఈ క్రమంలోనే జాబ్ కోసం అతడు దాదాపు 25 సంస్థలను సంప్రదించాడు.అయితే ఎక్కడికి వెళ్లినా అతడికి నిరాశ మాత్రమే మిగిలింది.

వెళ్లిన ప్రతి చోటా అతడు రిజెక్ట్ అవుతుండటంతో వినూత్నంగా ఆలోచించాడు.

Telugu Employees, Qr, Latest-Latest News - Telugu

అనుకున్నదే తడువుగా తన రెస్యూమ్‌ను QR codeలో పొందుపరిచి.కంపెనీ గోడలకు అతికించడం మొదలు పెట్టాడు.ఈ నేపథ్యంలో అతడి సీవీకి సంబంధించిన QR code‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

దీనిపై జార్జ్ ఏమి చెబుతున్నదంటే, ఎవరైనా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.తన రెస్యూమ్‌తోపాటు లింక్‌డిన్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుందన్నారు.దాంతో ఎవరికి తన అవసరం ఉంటుందో వారు తప్పకుండ కాల్ చేస్తారని భావిస్తున్నాడు.అయితే ఇది తనకు స్వతహాగా వచ్చిన ఆలోచన కాదని చెప్పాడు.

లండన్‌కు చెందిన ఓ వ్యక్తి జాబ్ కోసం ఇలానే ట్రై చేసినట్టు ఇంటర్నెట్‌లో చూసి, తనను ఫాలో అయినట్టు చెప్పడం హర్షణీయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube