కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి గ్రామంలోని కోటలో మేకలను మేపడానికి వెళ్లిన యువకుడు రాజేష్( Rajesh ), తప్పిపోయిన మేక పిల్లను వెతకడానికి సాయంత్రం కొండపై వెతుకుతుండగా రెండు కొండల మధ్య కాలుజారి ఇరుక్కున్నడు.రెండు కొండల మధ్య ఇరుక్కుపోయిన సమాచారాన్ని గ్రామస్తులకు తెలపాలని తన జేబులో ఉన్న సెల్ ఫోన్ ను అతి కష్టం మీద తీసి గ్రామస్తులకు ఫోన్ చేసి విషయం తెలిపాడు హుటాహుటిన గ్రామస్తులు కొండపైకి వెళ్లి తాడు సహాయంతో యువకుడు రాజేష్ ను అతి కష్టం మీద బయటికి తీశారు.
మూడు గంటల పాటు రాజేష్ కుండ చర్యలు మధ్య తీవ్ర ఇబ్బందులు గురి అయ్యాడు ఎట్టకేలకు గ్రామస్తులు సహాయంతో బయటపడ్డాడు.ఒకవేళ రాజేష్ దగ్గర సెల్ ఫోన్ లేకపోతే పరిస్థితి ఎలా? లేక జేబులో నుండి సెల్ ఫోన్ అతి కష్టం పైన తీసే సమయంలో సెల్ ఫోన్ జారిపోయి ఉంటే యువకుడు రాజేష్ ప్రాణాపాయ స్థితికి వచ్చేవాడని గ్రామస్తులు తెలిపారు.







