ఇటీవలే కాలంలో సైబర్ నేరగాళ్ల( Cyber criminals ) మోసాలకు అడ్డు అదుపు అనేది లేకుండా పోతోంది.ఇక నిరుద్యోగులు ఉద్యోగాల ఆశతో సైబర్ మోసాల బారిన పడి ఘోరంగా మోసపోతున్నారు.తాజాగా ఓ 25 ఏళ్ల నిరుద్యోగ యువకుడు ఉద్యోగం కోసం సైబర్ వలలో చిక్కి ఏకంగా రూ.3.07 లక్షలు పోగొట్టుకున్నాడు.

అసలు ఏం జరిగిందంటే.పూణే( Pune )లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న యువకుడు పార్ట్ టైం ఉద్యోగం కోసం తన ప్రొఫైల్ ను ఆన్ లైన్ జాబ్ పోర్టల్ లో అప్లోడ్ చేశాడు.ఆ తర్వాత కొందరు వ్యక్తులు మంచి పార్ట్ టైం జాబ్ చూపిస్తామని నమ్మించి మోసానికి పాల్పడ్డారు.
ముందుగా గూగుల్ మ్యాప్ రివ్యూలు రాయాలని చెప్పి, ఆ యువకుడి నమ్మకాన్ని గెలవడం కోసం అతని బ్యాంక్ ఖాతాలో కొంత నగదు వేశారు.

ఆ తర్వాత సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో మంచి పార్ట్ టైం జాబ్ ఉందని నమ్మించి ఆ యువకుడితో బలవంతంగా ఆగస్టు నెలలో రెండు దఫాలుగా రూ.3.07 లక్షల రూపాయలు బదిలీ చేయించుకున్నారు.కొన్ని రోజుల తర్వాత తన డబ్బు వెనక్కి చెల్లించాలని సైబర్ నేరగాళ్లను కోరగా.మరో రూ.50 వేలు చెల్లించాలని ఆ యువకుడిని డిమాండ్ చేశారు.ఆ యువకుడు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో బాధితుడి తో సంబంధాలు తెంచుకున్నారు.
తాను మోసపోయానని గ్రహించిన యువకుడు చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులు స్పందిస్తూ.ప్రస్తుతం ఆన్లైన్ ( Online )వేదికగా అనేక ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.అయితే సైబర్ నేరగాళ్లు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులను మోసం చేసి దొరికినంతవరకు సొమ్ము దోచుకుంటున్నారు.
కాబట్టి ఆన్లైన్ జాబ్ విషయంలో యువకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.జాబ్స్ విషయంలో సంబంధిత సంస్థ గురించి ముందస్తు తనిఖీలు చేయాలి.
ఒకవేళ అనుమానం వస్తే అవతలి వారితో ఎలాంటి సమాచారం పంచుకోకుండా ఉండాలి.