Director Bobby : వరుసగా ముగ్గురు సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తున్న యంగ్ డైరెక్టర్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలు సీనియర్ హీరోలుగా కొనసాగుతున్నారు.ఇక వీళ్లతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

 A Young Director Who Is Doing Films With Three Senior Heroes Consecutively-TeluguStop.com

ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళకు మంచి మార్కెట్ ఉంది.నిజానికి బాలకృష్ణ, చిరంజీవి లకు అయితే దాదాపు 200 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టే స్టామినా ఉండడం వల్ల వాళ్లతో సినిమాలు చేయడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇక అందులో భాగంగానే ఒక దర్శకుడు ముగ్గురు సీనియర్ హీరోలతో సినిమాలు చేసి ఏకైక యంగ్ డైరెక్టుగా కూడా గుర్తింపు పొందుతున్నాడు.ఆయన ఎవరు అంటే బాబీ( Director Bobby )వెంకటేష్ తో వెంకీ మామ అనే సినిమా చేశాడు, ఆ తర్వాత చిరంజీవితో వాల్తేర్ వీరయ్య అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ప్రస్తుతం బాలయ్య బాబు తో మరొక సినిమా చేస్తున్నాడు.ఇలా వరుసగా ముగ్గురు సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ జనరేషన్ డైరెక్టర్ గా కూడా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు…ఇక ఇదిలా ఉంటే ఈయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది.

 A Young Director Who Is Doing Films With Three Senior Heroes Consecutively-Dire-TeluguStop.com

చిరంజీవి తో చేసిన వాల్తేరు వీరయ్య( Waltair Veerayya )తో 200 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టాడు.ఇక ఇప్పుడు బాలయ్య బాబు( Balakrishna )కు కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టాలని చూస్తున్నాడు.

ఈ సినిమాని దసరా కానుక ప్రేక్షకులు ముందు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే ముగ్గురు హీరోలతో వరుసగా మంచి విజయాలను అందుకున్న డైరెక్టర్ గా గుర్తింపు పొందుతాడు.అలాగే ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందడమే కాకుండా మంచి పేరు సంపాదించుకొని ఆయనకున్న మార్కెట్ ను మరింత పెంచుకోగలుగుతాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube