సాధారణంగా లోయలు, కొండల ప్రాంతాలలో డ్రైవింగ్( Driving ) చేయడం ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే అవుతుంది.ఇక పెద్ద రాళ్లను లోడ్ చేసేటప్పుడు కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
రాళ్ల వెయిట్ అంచనా వేసుకొని దానిని మోసే సామర్ధ్యం ట్రక్కులకు ఉంటుందా లేదా అనేది కూడా చూసుకోవాలి.ఆ విషయంలో ఫెయిలైతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
రీసెంట్ గా ఇలాంటి ప్రమాదంలోనే ఒక డ్రైవర్( Driver ) పడ్డాడు.ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఒక ట్రక్కు డ్రైవర్ ఒక పెద్ద రాయిని క్రేన్ లాంటి దానితో తీసి ట్రక్కు వెనుక భాగంలో పెట్టాలని చూసాడు.కానీ రాయి చాలా బరువుగా ఉంది.అందువల్ల ట్రక్కు మీద దానిని సరిగా పెట్టడం కుదరలేదు.ట్రక్కు వెయిట్ రాయి వెయిట్ తో బ్యాలెన్స్ కాలేదు.కట్ చేస్తే ట్రక్కు పైకి లేచి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది.ఆ సమయంలో డ్రైవర్ కూడా అందులోనే ఉన్నాడు.
ఈ ప్రమాదం చూస్తుండగానే సెకండ్లలో జరిగిపోయింది.దీనికి సంబంధించిన వీడియోను 1000 వేస్ టు డై అని ప్రముఖ ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసింది.
దీనికి ఇప్పటికే 10 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఆ ట్రక్కు లోయలో క్షణాల్లోనే పడిపోగా.అందులో నేను డ్రైవర్ బతికాడా? పోయాడా? అని మరి కొందరు ప్రశ్నించారు.

ఇంత పెద్ద షాకింగ్ ఘటన జరిగినా అక్కడే ఉన్న ఇద్దరూ చాలా కూల్‌గా నడుస్తూ వెళ్లారు.ఈ ఘటనలు తాము రోజు చూస్తున్నామని, ఇవి తమకు కామనే అన్నట్లు వారు ప్రవర్తించిన తీరు షాక్‌కి గురిచేసాయి.ఓ మై గాడ్ ఇది చాలా పెద్ద ప్రమాదం, డ్రైవర్ కి ప్రాణాపాయం తప్పాలని ఆశిస్తున్నా అని ఒక యూజర్ కామెంట్ చేశారు.ఇలాంటి డ్రైవింగ్ జాబ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మరికొందరు అన్నారు.
ఈ వైరల్ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేయండి.







