వినాయకుడి ఒడిలో శ్రీకృష్ణుడు ఉన్న దేవాలయం.. మన దేశంలోని ఈ రాష్ట్రంలో..?

పురాణ గ్రంథాల ప్రకారం శ్రీ మహావిష్ణువు( Lord Vishnu ) పార్వతి దేవికి సోదరుని వరుస అవుతాడని చెబుతున్నారు.

ఈ వరుస ప్రకారం శ్రీకృష్ణుడు వినాయకుని మేనమామ అవుతాడు.

అలాంటి మేనమామ తన మేనల్లుడు ఒడిలో కూర్చున్న అపూర్వ దర్శనం మీరు ఎప్పుడైనా చూశారా? అలాంటి పుణ్యక్షేత్రం ఎక్కడుందో తెలుసుకోవాలంటే మనం కేరళలోని మళ్ళియూర్‌( Kerala ) గ్రామానికి వెళ్లాలి.అక్కడి దేవాలయంలో వినాయకుడి ఒడిలో బాలకృష్ణుడు దర్శనమిస్తాడు.

ఎన్నో సంవత్సరాల క్రితం ఈ దేవాలయంలో బీజ గణపతి రూపంలో వినాయకుడు దర్శనమిస్తాడు.

శంకరన్‌ నంబూద్రి గణపతి విగ్రహం పక్కనే సాలగ్రామాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉండేవారు.ప్రతి రోజు భాగవత పారాయణం చేసేవారు.ఒక రోజు ఆయనకు తన పూజలో వినాయకుడి విగ్రహం( Ganesha )లో బాలకృష్ణని రూపం స్పష్టంగా కనిపించింది.

Advertisement

ఆయన తను చూసిన దృశ్యాన్ని చెక్కిన రూపమే ఈరోజు ఆలయంలో దర్శనం ఇచ్చే విగ్రహం అని స్థానిక ప్రజలు చెబుతున్నారు.తొండం చివర నిమ్మపండు, హస్తాలలో కొడవలి, అంకుశం తనకు ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు చేత ధరించి తన మామ అయిన బాలకృష్ణుడిని తన ఒడిలో ఉంచుకొని దర్శనానుగ్రహాన్ని కలిగిస్తున్నాడు.

గర్భగుడిలో ఇతర దైవ విగ్రహాలు ఏవి ఉండవు.భక్తుల కోరికలను తక్షణమే నెరవేర్చే వరప్రసాది మళ్ళియూరు మహాగణపతి.

ఇక్కడ భక్తుల కష్టాలు తీరడానికి సహస్ర కలశాభిషేకం జరిపించుకుంటూ ఉన్నారు.వివాహ అడ్డంకులు లేకుండా ఉండడానికి పళ్ళమలాలు సమర్పిస్తారు.27 కదళీ ఫలాలతో కట్టే యి మాలను నక్షత్రం మాల అని పిలుస్తారు.అనారోగ్యాల నివారణకై బియ్యప్పిండి, చక్కెర, కొబ్బరి కలిపి మోదకంగా తయారు చేసి ఆవిరిలో ఉడికించి నివేదిస్తారు.

దీనినే దాడి నైవేద్యం అని అంటారు.ఈ దేవాలయంలో పితృ దోష పరిహారాలు కూడా జరుగుతూ ఉంటాయి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
శరత్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం

వినాయక చవితి రోజు చతుర్ధియూటు అనే పితృ దోష పరిహార పూజలు జరుగుతాయి.సంతాన భాగ్యం కోసం పాలు, పాయసం నివేదించి పూజిస్తారు.

Advertisement

తులాభారం మొక్కులు కూడా ఇక్కడ భక్తులు తీర్చుకుంటూ ఉంటారు.ఈ దేవాలయంలో తొమ్మిది రోజులు ఉత్సవం ఫాల్గుణ మాసంలో ఆరంభమై చైత్రమాసంలో వచ్చే విషు పండుగతో పూర్తవుతాయి.

తాజా వార్తలు