ఒక్క దెబ్బతో మెడ నలుపును మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ చిట్కా మీకోసం!

సాధారణంగా కొందరికి ముఖం తో పోలిస్తే మెడ రంగు డార్క్ గా ఉంటుంది.

ఎండల ప్రభావం, ప్రెగ్నెన్సీ, డెడ్ స్కిన్ సెల్స్‌ పేరుకుపోవడం తదితర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంది.

మెడ నల్లగా ఉంటే ముఖం ఎంత అందంగా ఉన్నా సరే అందవిహీనంగానే కనిపిస్తుంది.అందుకే మెడ నలుపును వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ఒక్క దెబ్బతో మెడ నలుపును మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ రెమెడీ ఒకటి ఉంది.మెడ నలుపును ఈ రెమెడీ సమర్థవంతంగా వదిలిస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు బొప్పాయి ముక్కలు, అర కప్పు టొమాటో ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement
A Super Powerful Tip To Get Rid Of Dark Neck, Super Powerful Tip, Dark Neck, Nec

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పొడి, రెండు టేబుల్ స్పూన్లు వైట్ షుగర్, రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

A Super Powerful Tip To Get Rid Of Dark Neck, Super Powerful Tip, Dark Neck, Nec

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకోవాలి.ఐదు నిమిషాల పాటు మెడను ఆరనిచ్చి అప్పుడు నిమ్మ చెక్కతో మృదువుగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు చాలా సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుని అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకోవాలి.

A Super Powerful Tip To Get Rid Of Dark Neck, Super Powerful Tip, Dark Neck, Nec

ఈ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే ఒక్క వాష్ లోనే మెడ తెల్లగా మారుతుంది.మెడ నలుపు ఇట్టే మాయం అవుతుంది.డెడ్ స్కిన్ సెల్స్ సైతం తొలగిపోయి మెడ కాంతివంతంగా మరియు మృదువుగా మారుతుంది.

మెడ నలుపుతో మదన పడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు