ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే నెల రోజుల్లో స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతమవుతుంది!

సాధారణంగా కొందరి ముఖం ఎలాంటి మచ్చ లేకుండా తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంటుంది.కానీ కొందరి ముఖం మాత్రం మచ్చలతో నిండిపోతుంది.

ముఖంపై ఎక్కడ చూసినా మచ్చలే కనిపిస్తుంటాయి.ఇటువంటి చర్మాన్ని కలిగిన వారు ఎంతో వేదనకు గురవుతుంటారు.

మచ్చలు వదిలించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా మీకు ఎంతో బాగా సహాయపడుతుంది.ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే కేవలం నెల రోజుల్లోనే స్పాట్ లెస్ స్కిన్ ( Spotless skin )మీ సొంతమవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక టమాటో ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement
A Simple Home Remedy For Getting Spotless Skin Naturally! Spot Less Skin, Skin C

ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ( Tomato slices )మరియు మూడు రెబ్బలు వేపాకు, నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

A Simple Home Remedy For Getting Spotless Skin Naturally Spot Less Skin, Skin C

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు గోధుమపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్( Wild Turmeric Powder ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోవాలి.అలాగే ముందుగా త‌యారు చేసి పెట్టుకున్న టమాటో వేపాకు జ్యూస్ ను కూడా వేసి అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేయాలి.

A Simple Home Remedy For Getting Spotless Skin Naturally Spot Less Skin, Skin C

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ఏదైనా బ్రష్ సహాయంతో పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్న సరే మాయం అవుతాయి.

పిగ్మెంటేషన్ సైతం దూరం అవుతుంది.నెల రోజుల్లో స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20

కాబట్టి ఎలాంటి మచ్చ లేకుండా ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలని అనుకునేవారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ రెమెడీని ప్ర‌య‌త్నించండి.

Advertisement

తాజా వార్తలు