ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో బీఆర్ఎస్ కు షాక్..!

ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీ బీఆర్ఎస్ షాక్ తగిలింది.బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.

ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఎమ్మెల్యే రాథోడ్ అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.తనను కాదని అనిల్ జాదవ్ కు బీఆర్ఎస్ టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మంత్రి కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూశారని తెలుస్తోంది.అయితే మంత్రి కేటీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో పార్టీని వీడాలని ఎమ్మెల్యే రాథోడ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఆయన త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు సమాచారం.

Advertisement
ఫెయిల్ అయిన సర్కస్ స్టంట్.. భయంకర బైక్ యాక్సిడెంట్ వైరల్..?

తాజా వార్తలు